కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఈటల, తలసాని

Coronavirus Vaccine Dry Run, Coronavirus Vaccine Dry Run In India, COVID 19 Vaccine, COVID 19 Vaccine Dry Run News, COVID 19 Vaccine Dry Run Updates, Covid Vaccine Dry Run Programme, Covid-19 Vaccination Dry run, Covid-19 Vaccine Dry Run, COVID-19 Vaccine Dry Run Details, COVID-19 Vaccine Dry Run In Nalgonda District, COVID-19 Vaccine Dry Run In Telangana, COVID-19 Vaccine Dry Run to be Conducted in All States, Dry Run For Covid-19 Vaccine, Etala Rajender, Etala Rajender Visits Covid Vaccine Dry Run Programme, Health Minister Etala Rajender, Mango News, Vaccine Dry Run

శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పీ.ఆర్.కే ఆసుపత్రిలో శనివారం నాడు జరిగిన కోవిడ్-19 వ్యాక్సిన్ డ్రైరన్ కార్యక్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ, గత సంవత్సరం నుంచి కరోనా మహమ్మారి ప్రపంచంలోని ప్రజలందరికీ కంటి మీద కునుకు లేకుండా చేసిందని అన్నారు. ప్రజల భద్రతకై అన్ని దేశాల శాస్త్రవేత్తలు కరోనా నిర్ములించుటకు కష్టపడి కరోనా వాక్సిన్ తయారు చేసి ప్రజలకు అందుబాటులో కి తెచ్చారని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు కరోనా వ్యాక్సిన్ అందించే నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు, జాగ్రత్తలు తీసుకున్నారని తెలిపారు.

రాష్ట్రంలో ముందుగా 2 లక్షల 90 వేల మందికి కరోనా వాక్సిన్:

రాష్ట్రంలో ముందుగా 2 లక్షల 90 వేల మందికి కరోనా వాక్సిన్ వేయబడుతుందని, ముందుగా ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య సిబ్బందికి, శానిటేషన్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్ అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కరోనా వ్యాక్సిన్ 2 డోసులు వేయబడతాయని, ఈ నెల 2న ఏడు సెంటర్లలో, 8న 800 సెంటర్లలో కరోనా వాక్సిన్ వేయుటకు డ్రైరన్ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ వేయుటకు పది వేల మంది నిష్ణాతులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రులలో పాటుగా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా డ్రైరన్ నిర్వహిస్తున్నాయని, పీ.ఆర్.కే ఆసుపత్రిలో 167 మంది వైద్య సిబ్బంది ఉన్నారని, ఈ ఆసుపత్రిలో రోగులకు వైద్య సేవలు అందించుటకు అన్ని హాంగులతో కూడిన సౌకర్యాలు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధి, పీ.ఆర్.కే ఆసుపత్రి చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఎండీ పుట్టా రవికుమార్, డీఎం అండ్ హెచ్ఓ స్వరాజ్య లక్ష్మీ, అడిషనల్ డీఎం అండ్ హెచ్ఓ సృజన, కార్పొరేటర్లు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 − 2 =