ప్రైవేట్ విద్యాసంస్థలు 30 శాతం ట్యూషన్ ఫీజు తగ్గించాలి, ఏపీ ప్రభుత్వం ఆదేశం

Andhra Pradesh government orders reduction in tuition fee, AP Govt Orders Private Institutions to Cut Tuition Fee, AP reduction in tuition fee, ap tuition fee reduce, GO 46 Orders for Collecting Tuition Fees, Government directs private schools to cut tuition fee, Private Institutions to Cut Tuition Fee, school fees, school fees reduction in ap, State Govt orders reduction in school tuition fee

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నవంబర్‌ 2 నుంచి స్కూళ్లు. కాలేజీల ప్రారంభానికి రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థల్లో ట్యూషన్ ఫీజుపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా పరిస్థితుల వలన ప్రజలకు ఏర్పడ్డ ఆర్ధిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ విద్యాసంస్థలు ఫీజులు తగ్గించుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ట్యూషన్ ఫీజును గత విద్యాసంవత్సరం కంటే 30 శాతం మేర తగ్గించాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు(స్కూల్స్, జూనియర్ కాలేజీలు) 2020-21 విద్య సంవత్సరానికి గానూ విద్యార్థుల నుంచి కేవలం 70 శాతం ఫీజు మాత్రమే వసూలు చేయాలని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏపీ పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ఉత్తర్వులు విడుదల చేశారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − four =