ఏపీలో ఏకగ్రీవమైన పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులు మంజూరు

2001 Unanimously Elected Gram Panchayats, 2001 Unanimously Elected Gram Panchayats In Ap, Andhra govt announces perks for unanimous panchayat polls, Andhra Pradesh govt to award panchayats elected unanimously, AP Govt, AP Govt Releses Rs 134.95 Cr Incentives to 2001 Unanimously, AP Govt Releses Rs 134.95 Cr Incentives to 2001 Unanimously Elected Gram Panchayats, AP govt. sanctions Rs 134.95 crore for gram panchayats, AP Gram Panchayats, Gram Panchayats, Mango News

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని నెలల క్రితం ఏకగ్రీవంగా ఎన్నికలు జరిగిన గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. 13 వేలకు పైగా గ్రామాల్లో జనవరి, ఫిబ్రవరి నెలల్లో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలలో 2,001 గ్రామ పంచాయతీల్లో సర్పంచి, వార్డు సభ్యుల పదవులు ఏకగ్రీవం అయ్యాయి. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 358 పంచాయతీలు.. అత్యల్పంగా అనంతపురం జిల్లాలో 36 పంచాయతీల్లో ఎన్నికలు ఏకగ్రీవం అయ్యాయి. ఆయా గ్రామాల అభివృద్ధికోసం ఈ నిధులను ఉపయోగించనున్నారు.

అయితే, ఈ పంచాయతీలకు రూ.134.95 కోట్ల ప్రోత్సాహక నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పార్టీలకు సంబంధం లేకుండా జరిగే పంచాయతీ ఎన్నికల్లో.. రాజకీయ వివాదాల జోలికి పోకుండా ప్రజలంతా ఏకతాటిపై కొనసాగుతూ, ఎన్నికను ఏకగ్రీవం చేసుకునే పంచాయతీలకు వాటి స్థాయినిబట్టి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు ప్రోత్సాహకాలు ప్రకటించిన విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికలు ఏకగ్రీవమైతే.. రెండువేల లోపు జనాభా ఉన్న గ్రామాలకు రూ.5 లక్షలు, 2,000-5,000 మధ్య జనాభా ఉన్నవాటికి రూ.10 లక్షలు ప్రోత్సాహక నిధులు అందిస్తున్నారు. అలాగే, 5,000-10,000 మధ్య జనాభా ఉన్నవాటికి రూ.15 లక్షలు, 10 వేలకుపైన జనాభా ఉన్న గ్రామాలకు రూ.20 లక్షల వంతున ప్రభుత్వం ప్రోత్సాహకాలను విడుదల చేసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight − 1 =