శ్రీవారి సర్వదర్శనం టిక్కెట్లు విడుదల – నిమిషాల వ్యవధిలో ఖాళీ

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సర్వదర్శనం టికెట్లు ఆన్ లైన్ లో విడుదలయ్యాయి. జనవరి నెలకు సంబంధించిన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఈరోజు విడుదల చేశారు. రోజుకు 10 వేల చొప్పున శ్రీవారి సర్వదర్శనం టికెట్లను టీటీడీ విడుదల చేసింది. జనవరి నెలలో 13-22 వరకు వైకుంఠ ఏకాదశి సందర్భంగా రోజుకు 5 వేల టికెట్లు అందుబాటులో ఉంచారు. మిగిలిన రోజుల్లో రోజుకు 10వేల చొప్పున టికెట్లను ఉంచారు. టికెట్లు విడుదలైన కేవలం 15 నిమిషాల్లోనే ఖాళీ కావడం గమనార్హం.

సర్వదర్శనం ఉచితం కావడంతో చాలా మంది భక్తులు టికెట్లు బుక్ చేసుకునేందుకు ఉదయం నుంచే అతృతతో వేచి ఉన్నారు. తమ పేర్లు నమోదు చేసుకునేందుకు అన్నీ సిద్ధం చేసుకుని ఉంచుకున్నారు. అయితే, సర్వర్ బిజీగా ఉండటంతో 9 గంటల సమయంలో 10 నిమిషాలు వర్చువల్ క్యూలో వేచి ఉండాలంటూ కనిపించింది. కానీ, 9:10 ప్రాంతంలో టికెట్లు బుక్ చేసుకునేందుకు చూడగా.. శని, ఆదివారాలు మరియు వైకుంఠ ఏకాదశి నేపథ్యంలో వచ్చే నెల 13 నుంచి 22 తేదీలు బుక్ అయిపోయినట్లు కనిపించింది. దీంతో మిగిలిన తేదీల్లో పేర్లు నమోదు చేస్తుండగానే, అవి కూడా బుక్ అయిపోయినట్లు కనిపించిండంతో భక్తులు తీవ్ర నిరాశకు గురయ్యారు.

శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్లు రేపు ఆన్ లైన్ లో విడుదల కానున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలలకు సంబంధించిన కోటాను రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. జనవరి 1న వెయ్యి బ్రేక్ దర్శన టికెట్లు(రూ. 500), జనవరి 13న వైకుంఠ ఏకాదశి రోజు వెయ్యి మహాలఘు దర్శన టికెట్లు(రూ. 300) అందుబాటులో ఉంచనున్నారు. కాగా, జనవరి 1 నుంచి 22 వరకు రోజుకు 2వేలు చొప్పున లఘు దర్శన టికెట్లు(రూ. 500) రేపు మధ్యాహ్నం నుంచి అందుబాటులోకి రానున్నాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లోని మిగతా రోజుల్లో ఆన్ లైన్ లో బ్రేక్ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఇంకా, సోమ నుంచి శుక్రవారం వరకు రోజుకు 200 చొప్పున బ్రేక్ దర్శన టికెట్లు(రూ. 500) శని, ఆదివారాల్లో 300 చొప్పున శ్రీవాణి ట్రస్టు బ్రేక్ దర్శన టికెట్ల(రూ. 500) ను కూడా రేపు టీటీడీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × two =