ఏపీలో ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ జేఈఈ, నీట్‌లలో ఉచిత కోచింగ్‌, ప్రారంభించిన మంత్రి మేరుగ నాగార్జున

AP Minister Meruga Nagarjuna Starts Free Training To SC Students For JEE and NEET in 8 Centres, Minister Meruga Nagarjuna Inaugurate Free Training To SC Students For JEE and NEET in 8 Centres, AP Minister Launches Free Training To SC Students For JEE and NEET in 8 Centres, Minister Meruga Nagarjuna Inaugurated Free Training To SC Students For JEE and NEET in 8 Centres, Free Training To SC Students For JEE and NEET in 8 Centres, Free Training To SC Students For NEET in 8 Centres, Free Training To SC Students For JEE in 8 Centres, JEE and NEET in 8 Centres, Free Training To SC Students, SC Students, Free Training, AP Minister Meruga Nagarjuna, Minister Meruga Nagarjuna, SC students Short-term Free coaching News, SC students Short-term Free coaching Latest News, SC students Short-term Free coaching Latest Updates, SC students Short-term Free coaching Live Updates, Mango News, Mango News Telugu,

ఆంధ్రప్రదేశ్‌లో డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ గురుకులాల ఆధ్వర్యంలో ఎస్సీ విద్యార్థులకు ఐఐటీ జేఈఈ, నీట్‌ పరీక్షల కోసం షార్ట్‌ టర్మ్‌ కోచింగ్‌ను అందిస్తున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున తెలిపారు. వర్చువల్‌ విధానం ద్వారా మంత్రి నిన్న ఈ ఉచిత కోచింగ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున మాట్లాడుతూ.. గతంలో కేవలం మూడు కేంద్రాల్లోనే ఇలాంటి శిక్షణ అందించారని, ఈ ఏడాది నుంచి 8 కేంద్రాల్లో ఉచిత శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఇలాంటి అవకాశాలను ఉపయోగించుకుని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి నాగార్జున ఉచిత శిక్షణ కేంద్రాల్లోని కొందరు విద్యార్థులతో వర్చువల్‌గా మాట్లాడి పలు సూచనలిచ్చారు.

సీఎం జగన్ ఆదేశాల మేరకు బాలికల కోసం ప్రత్యేకంగా విశాఖ లోని మధురవాడలో, పెనమలూరు లోని ఈడ్పుగల్లులో, ప్రకాశం లోని సింగరాయకొండలో, కడప లోని చిన్నచౌక్‌లో ఉచిత శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అలాగే బాలుర కోసం అనపర్తి లోని కొత్తూరులో, నెల్లూరు లోని చిల్లకూరులో, గుంటూరు లోని అడవి తక్కెళ్లపాడులో, కర్నూలు లోని చిన్నటేకూరులో కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కేంద్రాలలో ఎస్సీ విద్యార్థులకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ రెండు విధానాల్లోనూ శిక్షణ అందిస్తున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ లోని అంబేడ్కర్‌ గురుకుల విద్యా సంస్థల కార్యదర్శి పావనమూర్తి కూడా పాల్గొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × one =