జూ.ఎన్టీఆర్ పోస్టర్లను తొలగించేసిన బాలకృష్ణ

Balakrishna Removed Jr NTRs Posters, Jr NTRs Posters Removed, Junior NTR, Balakrishna, Nandamuri Family Issues, SR NTR Death Anniversary, Latest Jr NTRs Posters Removed News, Jr NTRs Posters Removed News Update, Latest TDP News, TDP News Update, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Junior NTR, Balakrishna, Nandamuri Family Issues, SR.NTR Death Anniversary

నందమూరి ఫ్యామిలీలో కలహాలు కాక రేపుతున్నాయి. కొద్దిరోజులుగా నందమూరి ఫ్యామిలీలో విభేదాలు కొనసాగుతుండగా.. తాజాగా మరోసారి బయటపడ్డాయి. బాలకృష్ణ , చంద్రబాబు నాయుడులతో పొసగక పోవడంతో కొద్దిరోజులుగా జూ.ఎన్టీఆర్ తెలుగు దేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు జూ.ఎన్టీఆర్, నందమూరి బాలకృష్ణల మధ్య విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఎన్టీఆర్ ఘాట్ వద్ద అభిమానులు ఏర్పాటు చేసిన జూ.ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించమని బాలకృష్ణ ఆదేశించడం వివాదానికి కారణమయింది. ప్రస్తుతం ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది.

సీనియర్ ఎన్టీఆర్ వర్థంతి నేడు. ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లి నివాళులు అర్పిస్తున్నారు. ఈరోజు ఉదయమే జూ.ఎన్టీఆర్, తన సోదరుడు కళ్యాణ్ రామ్‌తో కలిసి ఎన్టీఆర్ ఘాట్ వద్దకు వెళ్లారు. ఎన్టీఆర్ ఘాట్ వద్దు పుష్పగుచ్ఛాలు పెట్టి నివాళులర్పించారు. ఈక్రమంలో జూ.ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్ద పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున అభిమానులు ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్నారు.

అయితే ఎన్టీఆర్ ఘాట్ నుంచి జూ.ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్‌లు వెళ్లిపోయాక.. బాలకృష్ణ అక్కడికి చేరుకున్నారు. అక్కడ జూ.ఎన్టీఆర్ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చూసి.. వెంటనే తొలగించాలని ఆదేశించారు. వెంటనే అక్కడున్న బాలకృష్ణ అభిమానులు ఫ్లెక్సీలను అక్కడి నుంచి తొలగించేశారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద నుంచి ఫ్లెక్సీలను తొలగించి.. రోడ్డు పక్కన పడేశారు. ప్రస్తుతం ఫ్లెక్సీలను తొలగించాలంటూ బాలకృష్ణ ఆదేశించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. బాలకృష్ణ తీరుపై జూ.ఎన్టీఆర్ అభిమానులు భగ్గుమంటున్నారు.

మరోవైపు ఈ వ్యవహారంపై వైసీపీ మాజీ మంత్రి కొడాలి నాని స్పందిస్తూ.. బాలకృష్ణ, చంద్రబాబు నాయుడులపై భగ్గుమన్నారు. తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను సర్వనాశనం చేసేందుకు బాలకృష్ణ, చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగిస్తే తారక్‌కు ఏమైనా నష్టం జరిగిందా? అని ప్రశ్నించారు. ఫ్లెక్సీలను తొలగిస్తే తారక్‌కు జరిగే నష్టం ఏమీలేదన్నారు. వెయ్యిమంది చంద్రబాబులు, బాలకృష్ణలు వచ్చినా జూనియర్ ఎన్టీఆర్‌ను ఏమీ చేయలేరని నాని చెప్పుకొచ్చారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =