బ్యాడ్ న్యూస్.. కిందకు వంగుతున్న భూమి అక్షం.. కారణం ఇదేనట

Seoul National University and Other Researchers Announces That Downward Bending Earth Axis,Seoul National University and Other Researchers,Researchers Announces That Downward Bending Earth,Downward Bending Earth Axis,Seoul National University Announces Downward Bending Earth,Mango News,Mango News Telugu,Earths poles have shifted,problem with the earth's axis of rotation,Earth Axis Tilt Change,Effects of Earth's Rotation,Bending Earth Axis Latest News,Bending Earth Axis Latest Updates,Bending Earth Axis Live News,Seoul National University Latest News,Seoul National University Latest Updates

భూగర్భ శాస్త్రవేత్తలు బ్యాడ్ న్యూస్ వినిపించారు. కొన్నాళ్లుగా భూమి అక్షం మారిపోతున్నట్లు (bending earth axis)గుర్తించామని చెప్పారు. దీనికి కారణం ఎడాపెడా భూగర్భజలాలను తోడేయడమే కారణమని చెప్పారు. విచ్చలవిడిగా నీటిని తోడేస్తుండటంతో .. ఏకంగా భూమి అక్షమే మారిపోతుందని తాజా అధ్యయనంలో గుర్తించినట్లు ప్రకటించారు.

1993-2010 మధ్యకాలంలో జరిగిన మార్పులను గమనించగా.. ఆ సమయంలో భూగర్భ జలాలను (Groundwater) తోడివేయడం వల్ల భూమి అక్షం ప్రతీ ఏటా 4.36 సెంటీమీటర్ల చొప్పున వంగుతున్నట్లు గుర్తించారు. ఇలా భూమి తూర్పునకు వంగిపోతునట్టు జియోగ్రాఫికల్‌ రిసెర్చ్‌ లెటర్స్‌ జర్నల్‌లో..రీసెంట్‌గా ప్రచురించిన ఓ పరిశోధన పత్రంలో శాస్త్రవేత్తలు వివరించారు.

దక్షిణకొరియాకు చెందిన సియోల్‌ నేషనల్‌ యూనివర్సిటీ (Seoul National University), హాంకాంగ్‌లోని హాంకాంగ్‌ పాలిటెక్నిక్‌ యూనివర్సిటీ (Hong Kong Polytechnic University).. ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్‌ మెల్‌బోర్న్‌ (University of Melbourne)తో పాటు.. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ టెక్సాస్‌ పరిశోధకులు (University of Texas researchers) అంతా కలిసి నిర్వహించిన అధ్యయనంలో ఈ భయంకర వాస్తవం వెలుగు చూసింది. అంతేకాదు భూగర్భ జలాలను ఇలా ఎక్కువగా తోడి వేయటం వల్ల సముద్రమట్టాలు(sea levels) కూడా పెరుగుతున్నట్టు పరిశోధనలో తేలింది.

మానవుల నివాసానికి అనుగుణంగా ఉంచుకోవడానికి పర్యావరణాన్ని పాడుచేస్తున్నాడని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. తాను అన్ని సౌకర్యాలతో ఉండటానికి నివాస యోగ్యమైన అన్ని సదుపాయాలను సమకూర్చుకుంటున్నాడు. దీంతో ఇష్టాను సారంగా భూమిని తవ్వి ఎత్తయిన కట్టడాలను నిర్మించుకోవడం, లగ్జరీ అపార్డుమెంట్లు కట్టుకోవడానికి ఎక్కువ మొగ్గు చూపిస్తున్నాడు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లు నీళ్లు అవసరం ఉండటంతో భూగర్భ జలాలను పిండేస్తున్నాడు.

దీంతో ఒకప్పుడు వంద అడుగులు తవ్వితే బుసబుసమని పొంగే నీళ్లు ఇప్పుడు భూగర్బ జలాలు అడుగంటడంతో.. పన్నెండు వందలు, 15 వందలు తవ్వినా నీళ్లు అందడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉండటంతో .. భూమి వంగినట్లు అవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

నీటిని పొదుపుగా వాడే పరిస్థితి నుంచి నీటిని కొనుక్కుని అయినా ఇష్టారాజ్యంగా వాడుతున్న జనాలు పెరిగిపోతున్నారు. డబ్బులు ఖర్చు చేస్తున్నాం.. నీళ్లు కొనుక్కుని వాడుకుంటున్నాం అనుకుంటున్నారు తప్ప.. నీటి డిమాండ్ ఇలా పెరగడానికి తాము కూడా కారణమని ఆలోచించలేకపోతున్నారు. ఇప్పటి కైనా నీటిని పొదుపుగా వాడుకోకుండా ఇంకా భూగర్భ జలాల (Groundwater)ను తవ్వి పోస్తుంటే అంతా కట్టుకున్న ఇళ్లతో సహా భూమిలోకి కుంగిపోవడం తప్పదని హెచ్చరిస్తున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 1 =