సీదిరి అప్పలరాజును సైడేస్తారా? సీటిస్తారా?

CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan, Palasa Politics, Sidiri Appalaraju,Gauthu Sirisha, Srikakulam,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
CM Jagan, YCP, TDP, Janasena, Chandrababu, Pawan Kalyan, Palasa Politics, Sidiri Appalaraju,Gauthu Sirisha, Srikakulam

ఏపీలో ఎన్నికల హీటు రోజురోజుకు పెరిగిపోతోంది. రెండోసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామనే ధీమాతో వైసీపీ వ్యూహాలు సిద్ధం చేసుకుంటూ ఉండగా.. జనసేన, బీజేపీతో కలిసి తామే అధికారంలోకి వస్తామనే కాన్ఫిడెన్స్‌తో   తెలుగుదేశం పార్టీ ఉంది. టీడీపీ, జనసేన, బీజేపీతో కలిసి నడిస్తే.. కూటమి మధ్య, వైసీపీ మధ్య హోరాహోరీ రాజకీయ సంగ్రామం జరిగే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

ముఖ్యంగా 11 ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైనది  పలాస నియోజకవర్గం. పలాస నియోజకవర్గం నుంచి ఏపీ పశు సంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గౌతు శిరీషపై సీదిరి అప్పల రాజు 16,247 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు గౌతు లచ్చన్న మనవరాలే గౌతు శిరీష. 2014 ఎన్నికల్లో టీడీపీ తరఫున బరిలో దిగిన గౌతు లచ్చన్న కుమారుడు గౌతు శ్యాంసుందర్ శివాజీ.. 17,525 ఓట్ల మెజారిటీతో వైసీపీ నుంచి పోటీ చేసిన వజ్జా బాబూరావుపై అఖండ విజయాన్ని సాధించారు.

2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పలాస నియోజకవర్గం ఏర్పడింది. అక్కడ 2009లో మొదటిసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, 2014 ఎన్నికల్లో టీడీపీ గెలిచింది. అలాగే 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఇప్పటికే కొన్నాళ్లుగా నియోజకవర్గంలో మంత్రి అప్పలరాజు, గౌతు శిరీష మధ్య హోరాహోరీగా మాటల యుద్ధం జరుగుతోంది.రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా అప్పలరాజును ఓడిస్తామని  గౌతు శిరీష చెబుతుండగా, రెండోసారి కూడా వైసీపీదే విజయమని అప్పలరాజు సమాధానమిస్తున్నారు.

జనసేన, బీజేపీతో కలిసి పలాసలో విజయం సాధిస్తామని రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని టీడీపీ చెబుతోంది. మూడు పార్టీలతో ఢీకొన్నా కూడా తామే మళ్లీ పవర్లోకి వస్తామని వైసీపీ చెప్పుకొస్తుంది. అయితే  ఇప్పటికే ఏడు జాబితాలను విడుదల చేసిన  వైసీపీ అధినేత జగన్ ఈసారి జరగనున్న ఎన్నికలకు కూడా అప్పలరాజుకే టికెట్ కేటాయిస్తారా? లేక సర్వేల పేరుతో  వేరేవారికి ఇస్తారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =