తల్లుల లేఖ‌లు.. రాజ‌కీయ చుర‌క‌లు

YS Vivekananda Reddy Wife Sowbhagyamma Write Letter To CM Jagan, Sowbhagyamma Write Letter To CM Jagan, YS Vivekananda Reddy Wife Write Letter To CM Jagan, Letter To CM Jagan, CM Jagan, YS Sharmila, Sunita, Avinash, AP Assembly Elections, Mother's Letter, Political Tricks, YS Vivekananda Reddy, AP Assembly Elections, Lok Sabha Elections, Andhra Pradesh Elections, AP Political News, AP Live Updates, Andhra Pradesh, Political News, Mango News, Mango News Telugu
CM Jagan, YS Sharmila, Sunita, Avinash, AP Assembly Elections, Mother's letter, Political tricks

ఏపీ రాజ‌కీయాలు ఇప్పుడు వైఎస్ కుటుంబం చుట్టూ తిరుగుతున్నాయి. జగన్‌, షర్మిల, సునీత, అవినాష్‌.. వీరే కాకుండా ఎన్నడూలేని రీతిలో ఈ ఎన్నికల్లో సునీత తల్లి, వివేకానంద రెడ్డి సతీమణి వైఎస్‌ సౌభాగ్యమ్య, ఎంపీ అవినాష్‌రెడ్డి తల్లి వైఎస్‌ లక్ష్మి కూడా వార్తల్లో నిలిచారు. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య నేపథ్యంలో తమ బిడ్డలకు అనుకూలంగా లేఖలు రాశారు. న్యాయం కోసం పోరాటం చేస్తున్న చెల్లెళ్ళను హేళన చేస్తూ నిందలు మోపుతూ, దాడులకు కూడా తెగబడే స్థాయికి కొంతమంది దిగజారుతుంటే నీకు మాత్రం పట్టడం లేదా అంటూ జగన్‌కు ఆయన చిన్నమ్మ, సౌభాగ్యమ్య లేఖ రాశారు.

దానికి కౌంట‌ర్ గా అవినాష్ రెడ్డి త‌ల్లి లేఖ రాయ‌డం రాజ‌కీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ’’జగన్‌ను సీఎంగా చూడాలని వివేకానంద రెడ్డి కోరుకున్న మాట వాస్తవం కాదా?.. అవినాశ్‌ రెడ్డిని ఎంపీగా గెలిపించాలని వివేకా ప్రచారం చేసిన విషయం నిజం కాదా?.. అప్పుడు స్వయంగా మీ కుమార్తె సునీతనే ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు.. కానీ ఇవాళ దివంగత నేత వైఎస్‌ఆర్‌, సీఎం జగన్‌ శత్రువులతో చేతులు కలిపిన మీరు అదే ఎంపీ టికెట్‌ కోసం వివేకా హత్య కేసు జరిగిందని ఆరోపించడం, త‌ప్పుడు ప్రచారం చేయడం సరికాదు…సంబంధం లేని వారిని ఈ కేసులో ఇరికించడం త‌ప్పు అనిపించడం లేదా?.. ఎవరి కోసం, ఎవరిని కాపాడటం కోసం ఇదంతా చేస్తున్నారు?.. జగన్‌ తన తండ్రిని కోల్పోయిన‌ప్పుడు ఎంత మనోవేదన అనుభవించారో ఇప్పుడు గుర్తుకు వస్తుందా? కాంగ్రెస్‌ ప్రభుత్వం జగన్‌ను చిన్న చూపు చూసినపుడు అండగా నిలిచి పెద్దదిక్కుగా ఉండాల్సిన మీరు వ్యక్తిగత స్వార్థాలు చూసుకున్నారు.. జగన్‌ను ఒంటరిని చేసినపుఁడు ఆయన పడ్డ బాధ గుర్తుకు రాలేదా.. సునీత, ఆమె భర్తతో కలిసి విజయమ్మపై పోటీ చేయించినపుడు వాళ్ల మనోవేదన గురించి ఒక్కసారి కూడా అర్థం కాలేదా?

వివేకానంద రెడ్డి హత్యకు కారకులైన వారు మీతోనే ఉన్నారు.. దొంగే దొంగను పట్టుకోమంటే ఎలా దొరుకుతారు.. మాటిమాటికి హంతకుడంటూ తీవ్రమైన పదజాలంతో అవినాశ్‌ రెడ్డిని కించపరచడం సరికాదు…ప్రస్తుతం న్యాయస్థానంలో కేసు నడుస్తుండగా మీరే ఓ వ్యక్తిని హంతకుడిగా ఎలా నిర్ణయిస్తారు…అలా అసత్య ఆరోపణలు చేయడం తపఁనిపించడం లేదా? నీ కుమార్తె సునీతను, షర్మిలమ్మను ఎవరు టార్గెట్‌ చేయలేదు.. వారు మాట్లాడుతున్న మాటలే ఇతరులు హేళన చేయడానికి కారణం.. న్యాయం కోసం పోరాటం చేస్తే జగన్‌ పూర్తి మద్దతు సునీతకు ఉంటుంది.. కానీ వైఎస్‌ఆర్‌, జగన్‌ శత్రువుల చేతిలో కీలు బొమ్మలుగా మారి అన్యాయంగా సంబంధం లేని వ్యక్తులను కేసులో ఇరికించి వారి జీవితాలను నాశనం చేయాలని చూస్తే మద్ధతు ఎలా ఇస్తారు. ఇపఁటికైనా శత్రువుల చెంత నుంచి బయటకు రావాలి.. తపుఁ తెలుసుకుని నిజమైన న్యాయం కోసం పోరాటం చేయాలి.. అన్యాయంగా ఆరోపణలు ఎదుర్కొన్న వారు ఎంత బాధ, ఇబ్బంది పడుతున్నారో అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి.. నిజం ఎంత లోతులో దాచినా దాగదు.. ఏదో ఒకరోజు తపఁకుండా బయట పడుతుంది.. ‘‘ అని వైఎస్‌ లక్ష్మీ తన లేఖలో సౌభాగ్యమ్మను నిలదీశారు. ష‌ర్మిల‌, సునీత‌కు మ‌ద్ద‌తుగా సౌభాగ్య‌మ్మ‌, జ‌గ‌న్‌, అవినాష్ కు మ‌ద్ద‌తుగా ల‌క్ష్మి రాసిన లేఖ‌లు రాజ‌కీయంగా వైర‌ల్ అవుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + seventeen =