దీపక్ రెడ్డి వైపు చంద్రబాబు మొగ్గు

Rayala Seema,Chandrababu, Deepak Reddy,TDP,Congress, YCP, Janasena, Bjp, Jagan,Kalava Srinivasulu,Andhra Pradesh News Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Rayala Seema,Chandrababu, Deepak Reddy,TDP,COngress, YCP, Janasena, Bjp, Jagan,

ఏపీలో ఎన్నికలు సమీపించడంతో అభ్యర్దుల ఎంపిక పైనే ప్రధాన పార్టీలన్నీ ఫోకస్ చేసాయి. ప్రతీ నియోజకవర్గాన్ని  కీలకంగా తీసుకుంటున్నాయి. తాజాగా రాయలసీమలో వైసీపీ సిద్దం సభ తరువాత టీడీపీ అలర్ట్ అయింది. వైసీపీకి బలం ఎక్కువగా అక్కడే ఉండటంతో.. సీమ జిల్లాల్లో తాము కూడా బలం చాటుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. దీనిని దృష్టిలో పెట్టుకునే టీడీపీ అభ్యర్థుల ఎంపికలో చంద్రబాబు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటున్నారు.

2019 ఎన్నికల్లో సీమ రీజియన్‌లోని 4 జిల్లాల్లో తెలుగు దేశం పార్టీ 3 సీట్లకు మాత్రమే పరిమితం అవడంతో..ఈ సారి పూర్తిగా పట్టు సాధించే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే పార్టీకి  కొంత వరకూ పట్టున్న అనంతపురం జిల్లా పైన స్పెషల్ ఫోకస్ చేసింది. అనంతపురం జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ  మెజార్టీ సీట్లను సాధించి వైఎస్సార్సీపీకి చెక్ పెట్టాలని అనుకుంటోంది. దీనిలో భాగంగానే 2 ఎంపీ స్థానాల్లో అభ్యర్థుల ఎంపిక విషయంలో ముందుగా సామాజిక సమీకరణాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది.  పొత్తులో భాగంగా హిందూపురం ఎంపీ స్థానాన్ని బీజేపీ కోరుతుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇటు  వైసీపీ జిల్లాలోని రెండు ఎంపీ స్థానాలను కూడా బీసీలకు కేటాయించింది.

ఇప్పటికే  రాయదుర్గం సీటు విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు  సర్వేలు చేయించారు. అయితే తాను ఎంపీగా కాకుండా, ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని కాల్వ శ్రీనివాసులు కోరుతున్నా.. పార్టీ మాత్రం ఎంపీగానే పోటీ చేయించడానికి  ఫిక్స్ అయింది. దీంతో పాటు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, పూల నాగరాజు పేర్ల పైన కూడా చంద్రబాబు సర్వే చేయించినట్లుగా తెలుస్తోంది. లోకేష్‌కు సన్నిహితుడిగా ఉండటంతో పాటు ఆర్థికంగానూ, కేడర్ మద్దతు ఉన్న దీపక్ రెడ్డి వైపు చంద్రబాబు చూస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ మీద చేసే రాజకీయ పోరాటంలో కొన్నాళ్లుగా జిల్లాలో క్రియాశీలకంగా ఉన్నారు. పార్టీ వాయిస్‌ను జాతీయస్థాయిలో బలంగా వినిపించే లీడర్‌గా దీపక్ రెడ్డికి పేరు ఉంది. అటు సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పక్కనపెట్టి.. గోవిందరెడ్డిని అక్కడ అభ్యర్థిగా  ఖరారు చేసింది వైసీపీ .

దీంతో కాపు రామచంద్రారెడ్డి పార్టీ వీడతారని, కాంగ్రెస్‌లో చేరి పోటీ చేస్తారనే  ప్రచారం సాగుతోంది. ఒకవేళ పార్టీ మారకపోయినా గోవింద రెడ్డికి సపోర్టు ఇచ్చే పరిస్థితి అక్కడ లేదు. దీనిని అనుకూలంగా మార్చుకున్న టీడీపీ..సామాజిక వర్గ పరంగా గోవిందరెడ్డికి పోటీగా దీపక్ రెడ్డిని నిలబెడితే బాగుంటుందని ఆలోచిస్తుంది. అలాగే అనంతపురం జిల్లాలో జేసీ బ్రదర్స్ కుమారుల్లో ఒకరికి మాత్రమే సీటు ఇవ్వడానికి చంద్రబాబు అంగీకరించారు. దీంతో, రాయదుర్గంలో దీపక్ రెడ్డిని నిలబెడితే మంచిదనే  అంచనా వేస్తున్నారు. సర్వేలు దీపక్ రెడ్డి వైపే మొగ్గు చూపిస్తుండటంతో దీపక్ అయితేనే బెటరనే కంక్లూజన్ కు వచ్చినట్లు తెలుస్తోంది. రెండు రోజుల్లోనే దీనిపై పూర్తి క్లారిటీ రానుందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 13 =