మనబడి నాడు-నేడు పాఠశాలలు, రెండో విడత జగనన్న విద్యా కానుక ప్రారంభించిన సీఎం జగన్

Andhra Pradesh CM Jagan Mohan Reddy, AP CM YS Jagan, AP Jagananna Vidya Kanuka Program, AP Jagananna Vidya Kanuka Scheme, CM Jagan Launched Mana Badi Nadu-Nedu, CM Jagan Launched Mana Badi Nadu-Nedu Schools, Jagananna Vidya Kanuka, Jagananna Vidya Kanuka Programme, Jagananna Vidya Kanuka Scheme, Jagananna Vidya Kanuka Scheme Beneficiaries, Mana Badi Nadu-Nedu, Mana Badi Nadu-Nedu Schools, Mango News, Second Phase Jagananna Vidya Kanuka, YS Jagan inaugurates schools constructed under Manabadi, YS Jaganmohan Reddy

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సోమవారం నాడు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మనబడి నాడు-నేడు పాఠశాలలు, జగనన్న విద్యా కానుక రెండో విడత కార్యక్రమాలను సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. మనబడి నాడు-నేడు తొలిదశలో భాగంగా 3,669 కోట్లతో 15,715 పాఠశాలలను ప్రభుత్వం ఆధునీకరించింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమవడంతో ఆధునీకరించిన పాఠశాలలను విద్యార్థులకు సీఎం అంకితం చేశారు. తొలి విడత పనులు పూర్తి అయిన పాఠశాలలకు సంబంధించిన పైలాన్‌ ను సీఎం జగన్ ఆవిష్కరించారు.

అలాగే నాడు-నేడు కింద 4,535 కోట్లతో 16,368 పాఠశాలల్లో రెండో విడతలో చేపట్టబోయే పనులకు కూడా సీఎం శ్రీకారం చుట్టారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రూ.731.30 కోట్లతో చేపడుతున్న ‘జగనన్న విద్యా కానుక’ రెండో విడత పంపిణీని సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా 47.32 లక్షల మంది విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్లు పంపిణీ చేయనున్నారు. ముందుగా పి.గన్నవరం మండలంలోని పోతవరం హెలిపాడ్ వద్దకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్, అనంతరం పి.గన్నవరం జెడ్పీ హైస్కూల్‌ను సందర్శించి నాడు-నేడులో భాగంగా చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. తర్వాత తరగతి గదులు పరిశీలించి, ఓ తరగతి గదిలో బోర్డుపై ఆల్‌ ద వెరీ బె​స్ట్‌ అని రాసి, విద్యార్థులకు సీఎం శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం విద్యార్థులతో ముచ్చటించి, పాఠశాలల్లో కొత్తగా ఏర్పాటు చేసిన సౌకర్యాలు ఎలా ఉన్నాయో అడిగి తెలుసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × two =