సెప్టెంబరు 3న దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం, చర్చించాల్సిన అంశాలపై అధికారులకి సీఎం జగన్‌ దిశానిర్దేశం

Cm Jagan Orders Officials To Raise Pending Bifurcation Issues In Southern States Meeting On 3rd September, Ap Govt To Raise Bifurcation Issues, Agenda For Southern Council Meet, Mango News, Mango News Telugu, Pending Bifurcation Issues, Post bifurcation Issues , Ap Cm Ys Jagan Mohan Reddy, Andhra Pradesh Govt, Bifurcation Issues In Southern States, Southern Zonal Council Meet, Ys Jagan Decides To Raise Pending Bifurcation Issues

సెప్టెంబర్ 3న తిరువనంతపురంలో దక్షిణాది రాష్ట్రాల మండలి సమావేశం జరగనుంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున చర్చించాల్సిన అంశాలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో సోమవారం సమావేశం జరిగింది. తాడేపల్లి లోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, సీఎస్‌ సమీర్‌ శర్మ, వ్యవసాయశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ శ్రీలక్ష్మి సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తన తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైయస్సార్‌ వర్ధంతి సందర్భంగా ఈ సమావేశాలకు తాను హాజరు కావడం లేదని తెలిపారు. అయితే ఆర్థిక శాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి నేతృత్వంలో రాష్ట్రం నుంచి ప్రతినిధి బృందం హాజరవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. వాటిలో కొన్ని కీలక అంశాలు..

  • రాష్ట్ర విభజన జరిగి 8 ఏళ్లు అవుతున్నా ఇంకా పెండింగ్‌లోనే పలు సమస్యలు, జోనల్‌ కమిటీ సమావేశంలో వీటి గురించి ప్రస్తావించి పరిష్కారం కోసం దృష్టి పెట్టాలి.
  • పరిష్కారాలను సూచించే వ్యవస్థను ఏర్పాటు చేయాల్సిందిగా కోరాలి. అలాగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను అమలు చేసేదిగా ఉండాలంటూ గట్టిగా డిమాండ్‌ చేయాలి.
  • ఇక విభజన వల్ల ఏపీ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిందని, హైదరాబాద్‌ లాంటి నగరాన్ని కోల్పోయిందని గుర్తు చేయాలి.
  • అంతేకాకుండా ప్రస్తుతం విభజన సమస్యలు పరిష్కారంలో ఆలస్యం అవుతున్న కొద్దీ రాష్ట్రానికి ఇంకా ఎక్కువ నష్టమే జరుగుతోందని వివరించాలి.
  • ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయడానికి తగిన నిధులు విడుదల చేసే అంశాన్ని కూడా అజెండాలో ఉంచాలని అధికారులకి సూచన.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four − one =