రాష్ట్రంలో పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై నేడు సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం

10th and Intermediate Exams In AP, 10th class exams 2021, 10th exams in ap 2021 latest news, AP 10th and Intermediate Exams, ap 10th class exams 2021 updates, CM YS Jagan, CM YS Jagan to Take Decision on 10th and Intermediate Exams, CM YS Jagan to Take Decision on 10th and Intermediate Exams Today, COVID-19, Decision on 10th and Intermediate Exams, Mango News, SSC exams, YS Jagan Mohan Reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్య భద్రత దృష్ట్యా పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తుండడంతో పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ పరీక్షల నిర్వహణపై కీలక ప్రతిపాదనలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముందుకు తీసుకెళ్లనుంది. గురువారం నాడు మంత్రులు, విద్యాశాఖ అధికారులతో సీఎం వైఎస్ జగన్ విద్యాశాఖపై సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణపై సీఎం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. మరోవైపు జూలై 7 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు ఇంటర్‌ బోర్డ్‌ ప్రతిపాదనలు చేయగా, జూలై 26 నుంచి ఆగస్ట్ 2వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహణకు విద్యశాఖ అధికారులు ప్రతిపాదనలు చేసినట్లు తెలుస్తుంది. ఈ ఏడాది కూడా పదో తరగతిలో 11 పేపర్లకు బదులు ఏడు పేపర్లకే పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × three =