త్వరలో అమరావతికి ప్రియాంక గాంధీ.. విశాఖకు రాహుల్ గాంధీ..

Congress high commands next focus is on AP,Congress high commands,Next focus is on AP,Congress Next Focus is on AP,Congress BJP Leaders in AP Aiming,congress,AP,telangana, rahul gandhi,election,Mango News,Mango News Telugu,Stability of Congress govt in AP,Congress high command Latest News,Congress high command Latest Updates,Congress high command Live News,Congress govt in AP Latest News,Congress govt in AP Latest Updates,AP Politics,AP Latest Political News,Andhra Pradesh Latest News,Andhra Pradesh News,Andhra pradesh Politics
congress,AP,telangana, rahul gandhi,election

తెలంగాణలో గెలిచి తీరుతామని కాంగ్రెస్ నేతలు బల్లగుద్ది చెబుతున్నారు. మూడో తేదీ తర్వాత తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తామేనని అంటున్నారు. సానుకూల పవనాలు వీయడం.. పలు సర్వేల నివేదికలు అనుకూలంగా రావడంతో టి.కాంగ్రెస్ నేతలు గెలుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే తెలంగాణలో పరిస్థితి చూసి.. ఏపీ కాంగ్రెస్ నేతల్లో కూడా కదలిక వచ్చింది. ఏపీలో కూడా గ్రాఫ్ పెంచుకునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు.

మరో మూడు, నాలుగు నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ ఉనికిని చాటుకునేందుకు కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో ఎన్నికలు ముగియగానే.. కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ అంతా ఏపీపైనే ఉంటుందని సంబంధిత వర్గాలు చెబుతున్నారు. డిసెంబర్ రెండో వారం నుంచి కాంగ్రెస్ పెద్దలు ఏపీ పైనే ఫోకస్ పెట్టనున్నారట.అటు ఢిల్లీ నుంచి అగ్రనేతలను రంగంలోకి దింపేందుకు ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. త్వరలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు ఏపీలో పర్యటించనున్నట్లు తెలుస్తోంది.

విపక్షాల మాదిరిగానే ఏపీకి రాజధానిగా అమరావతినే ఉంచాలని కాంగ్రెస్ గొంతెత్తి చెబుతోంది. అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు అండగా ఉంటామని ఇప్పటికే కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈక్రమంలో అమరావతిలో భారీ బహిరంగ సభను నిర్వహించాలని ఏపీ కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారట. అమరావతి ప్రజలను ఆకట్టుకునేందుకు.. ఈసభకు ప్రియాంక గాంధీని ఆహ్వానించనున్నారట. ఏపీకి ఏకైక రాజధాని అమరావతే అనే అంశంపై.. ఏపీ ప్రజలకు ప్రియాంక గాంధీ కీలక సందేశం ఇవ్వనున్నారట.

అమరావతి సభ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వరుసగా సభలు నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రణాళికలు రచిస్తోంది. అమరావతి ఇష్యూపై ప్రియాంక గాంధీని.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూతో రాహుల్ గాంధీని రంగంలోకి దింపాలని ఏపీ కాంగ్రెస్ భావిస్తోంది. ప్రియాంక గాంధీ సభ ముగిసిన తర్వాత.. రాహుల్ గాంధీని విశాఖ రప్పించనున్నారట. అక్కడ కూడా సభను నిర్వహించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × one =