ఏపీ గనుల శాఖ ‘ఎస్మా’ ప్రయోగం.. ఉద్యోగుల విస్మయం

Ap Mines Department, AP Mining Department issues ESMA proceedings, Employees of Mines Department in AP, ESMA, ESMA To Be Implemented on Employees of Mines, ESMA To Be Implemented on Employees of Mines Department, ESMA To Be Implemented on Employees of Mines Department in AP, Mango News, Mines Department

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అర్ధరాత్రి నుంచి ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లనున్నారు. ఈ క్రమంలో.. ఉద్యోగులపై ఏపీ గనుల శాఖ ఎస్మా ప్రయోగించింది. గనులశాఖ డైరెక్టర్ వెంకట్ రెడ్డి ఈ ఉత్తర్వులను జారీ చేశారు. కాగా, ఈ ఉత్తర్వులపై గనుల శాఖ ఉద్యోగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం, ఉద్యోగ సంఘాల నేతల మధ్య చర్చలు జరుగుతుంటే.. అకస్మాత్తుగా ఎస్మా ఉత్తర్వులు ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. గనుల శాఖలో అత్యవసర సేవలు ఏం ఉంటాయని ప్రశ్నిస్తున్నారు.

గత కొద్దిరోజులుగా పీఆర్సీ విషయంలో ప్రభుత్వానికి.. ఉద్యోగులకు నెలకొన్న వివాదం రోజురోజుకూ జఠిలమవుతోంది. ఈనేపథ్యంలో.. సమ్మెకు దిగబోతున్న పీఆర్సీ సాధన సమితి నాయకులకు ఆర్టీసీ ఉద్యోగులు సైతం జత కలిశారు. రేపు అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ ఉద్యోగులు సైతం నిరవధిక సమ్మెకు దిగబోతున్నారు. మరోవైపు ఉద్యోగులు సమ్మెకు వెళ్లకుండా ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. నిన్నటినుంచి ఉద్యోగ సంఘాల నేతలతో మంత్రుల కమిటీ చర్చలు జరుపుతోంది. మరోవైపు ఉద్యోగులపై తమ మాట వినకుంటే కఠిన చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × five =