నరసాపురంలో ఫిబ్రవరి 20న జనసేన మత్స్యకార అభ్యున్నతి సభ, హాజరు కానున్న పవన్

AP Fishermen’s Development, AP Fishermen’s Development Meet, AP Fishermen’s Development News, Fishermen’s Development Meet, Fishermen’s Development Meet at Narasapuram, Fishermen’s Development Meet at Narasapuram on February 20th, janasena chief pawan kalyan, Mango News, pawan kalyan, Pawan Kalyan To Attend Fishermen’s Development Meet, Pawan Kalyan To Attend Fishermen’s Development Meet at Narasapuram, Pawan Kalyan To Attend Fishermen’s Development Meet at Narasapuram on February 20th

ఫిబ్రవరి 20వ తేదీన నరసాపురంలో ‘మత్స్యకార అభ్యున్నతి సభ’ నిర్వహించాలని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. ఈ మేరకు జనసేన పార్టీ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేసింది. “మత్స్యకారుల జీవన ప్రమాణాలు పెంపొందింప చేయడం, వృత్తిపరమైన ఉపాధి భరోసా, మత్స్యకారుల డిమాండు ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా మిగిలిపోయాయి. ప్రభుత్వంలోని పెద్దలకు వీటిపై దృష్టిపెట్టి సమయం, ఆలోచన రెండూ లేని నేపధ్యంలో మత్స్యకారుల పూన ముఖ్యంగా మత్స్యకారుల ఉపాధిని దెబ్బ తీసి విధంగా ఉన్న 217 జి.ఓపై గళమెత్తడానికి పవన్ కళ్యాణ్ ఈ సభ జరపాలని సంకల్పించారు. జనసేన పార్టీ మత్స్యకార వికాస విభాగం చైర్మన్ బొమ్మిడి నాయకర్ పర్యవేక్షణలో సభ సాగుతుంది. ఇందులో భాగంగా ఈ నెల 13వ తేదీ నుంచి ఉభయగోదావరి జిల్లాలకు చెందిన జనసేన నాయకులు, శ్రేణులు, వీర మహిళలు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలలోని మత్స్యకార గ్రామాలలో ‘మత్స్యకార అభ్యున్నతి యాత్ర’ చేపడతారు” అని తెలిపారు.

ఫిబ్రవరి 13వ తేదీన తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడ రూరల్ మండలంలోని సూర్యారావుపేట నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని చెప్పారు. ఈ యాత్రను జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ప్రారంభిస్తారని, 13, 14 తేదీల్లో రెండు రోజులపాటు ఈ యాత్రలో ఆయన పాల్గొంటారని తెలిపారు. 20వ తేదీన నరసాపురంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ నిర్వహిస్తారన్నారు. ముందుగా చేపట్టే యాత్రలో పార్టీ మత్స్యకార వికాస విభాగం క్షేత్రస్థాయిలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, సమస్యలను అధ్యయనం చేస్తుందని, ఇందుకు సంబంధించిన నివేదికను వికాస విభాగం ఛైర్మన్ నాయకర్, ఇతర సభ్యులు పవన్ కళ్యాణ్ కు అందచేస్తారని పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five + 17 =