చరిత్ర పునరావృతం కావాలి: చంద్రబాబు

History Must Repeat Itself Says Chandrababu, History Must Repeat Itself, Chandrababu Says History Must Repeat Itself, Itself History Repeat Says Chandrababu, Chandrababu Naidu, Telugu Desam Party, Sr NTR, AP Assembly Elections, Latest Chandrababu Comment News, Chandrababu Comment News Update, CM Jagan, Andhra Pradesh, Ap Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Chandrababu naidu, Telugu desam Party, Sr NTR, AP Assembly elections

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ మరింత హీటెక్కుతున్నాయి. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వరుసగా ఇంఛార్జ్‌లను మార్చేస్తూ కాక రేపుతున్నారు. ఇప్పటికే 38 స్థానాలకు ఇంఛార్జ్‌లను మార్చగా.. మరో 29 స్థానాలను కూడా మార్చనున్నట్లు తెలుస్తోంది. అటు పొత్తు పెట్టుకొని ఎన్నికలకు వెళ్తోన్న తెలుగు దేశం, జనసేన పార్టీలు.. వైసీపీని గద్దె దించేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నాయి.  అధికారం దక్కించుకోవడం కోసం తెరిచి ఉన్న ఏ ఒక్క దారిని కూడా వదలకుండా జనసేన, తెలుగు దేశం పార్టీలు పావులు కదుపుతున్నాయి.

ఇటీవల యువగళం-నవశకం సభతో తెలుగు దేశం పార్టీ ఎన్నికల సమర శంఖాన్ని పూరించింది. ఇప్పటి నుంచే చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ విస్తృతంగా ప్రచారం చేస్తుండగా.. నియోజకవర్గాల వారీగా టీడీపీ కార్యకర్తలు, నేతలు జనాలకు దగ్గరగా ఉంటున్నారు. అంతేకాకుండా చంద్రబాబు నాయుదు రా కదలిరా పేరుతో భారీ బహిరంగ సభలను నిర్వహిస్తున్నారు. రోజుకు రెండు, మూడు నియోజకవర్గాల్లో సభలు నిర్వహిస్తూ హోరెత్తిస్తున్నారు. వైసీపీ పాలనలో జరిగిన అరాచకం.. ప్రజలకు జరిగిన అన్యాయం.. వైసీపీ సర్కార్ ప్రజలకు చేస్తున్నా మోసాలను ప్రజలకు వివరించే మోసం ప్రజలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే గతంలో ఇదే రోజున సీనియర్ ఎన్టీఆర్ మొదటిసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. ఈ మేరకు అప్పడు ఎన్టీఆర్ ప్రమాణస్వీకారం చేస్తున్న ఫొటోను చంద్రబాబు నాయుడు సోషల్ మీడియాలో షేర్ చేసి ఎమోషనల్ అయ్యారు. ‘‘నలభై ఒక్క ఏళ్ళ క్రితం 1983లో ఇదే రోజు నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారు. దేశంలోనే మొదటిసారిగా సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టారు. మళ్ళీ చరిత్ర పునరావృతం కావాలి. విధ్వంసకర పాలకుల పీడ నుంచి తెలుగు జాతి విముక్తిని  పొంది ప్రపంచంలోనే అత్యున్నత స్థానాన్ని అందుకోవాలి. ఎన్టీఆర్ స్ఫూర్తిగా ఆ మహోదయం కోసం ఉద్యమిద్దాం’’ అని చంద్రబాబు నాయుడు తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ పెట్టారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two × 4 =