సోషల్ మీడియాలో ఫేక్ వార్తలకు చెక్

Hyper Aadi Busy With Janasena Campaign,BJP,Chandrababu,Hyper Aadi,Janasena,Janasena Party,Pawan Kalyan,Pithapuram,TDP,Telugu News,Mango News,Mango News Telugu,Elections 2024,AP Elections 2024,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Hyper Aadi Latest News,Hyper Aadi Janasena Campaign,Hyper Aadi Campaign For Pawan Kalyan In Pithapuram,Hyper Aadi Campaign For Pawan Kalyan,Hyper Aadi Election Campaign To JanaSena Party,Aadi,Hyper Aadi Speech,Hyper Aadi About JanaSena,Hyper Aadi Campaign In Pithapuram,Hyper Aadi Election Campaign at Pithapuram

ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతుండటంతో.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కోసం..కొంతమంది సినీ, టీవీ ఇండస్ట్రీ నుంచి  స్టార్ క్యాంపెనర్‌లుగా మారి ప్రచారాలను ప్రారంభిస్తున్నారు.   జనసేన ప్రచారకర్తలుగా ఉన్న వారిలో ఒకరైన హైపర్ ఆది కూడా ప్రచారంలో బిజీ అయిపోయారు.  అందరి హీరోలకు అభిమానులుంటే పవన్ కళ్యాణ్‌కు మాత్రం భక్తులుంటారని చాలామంది అంటూ ఉంటారు. ఇదే విషయాన్ని  హైపర్ ఆది ఎన్నోసార్లు చెబుతూ తాను కూడా భక్తుడినే అని చెప్పుకునేవారు.

మొదటి నుంచి హైపర్ ఆది పవన్ కళ్యాణ్ కు వీరాభిమానే. చాలా  సందర్భాలలో జనసేన పార్టీ తరపున మాట్లాడిన ఆది.. అధికార పార్టీపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే.  హైపర్ ఆది తాజాగా ఏపీ ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో బిజీబిజీగా మారిపోయారు.  ఎన్నికల ప్రచార కార్యక్రమాలలో భాగంగా  పిఠాపురంలో హైపర్ ఆది తన ప్రచార కార్యక్రమాలను ప్రారంభించి..అధికార పార్టీపై విమర్శలు చేశారు.

ప్రచార కార్యక్రమాలలో భాగంగానే తాను పిఠాపురం వచ్చానని.. ఇక్కడ ఎవరిని అడిగినా తమ  ఓటు పవన్ కళ్యాణ్ గారికే అంటూ చెబుతున్నారని హైపర్ ఆది చెప్పుకొచ్చారు. ఎన్నికలు జరగకుండానే పవన్ కళ్యాణ్ గెలుపు ఖాయమన్న విషయం తేలిందని అన్న ఆది.. పవన్ కళ్యాణ్  లక్ష మెజారిటీతో విజయం సాధిస్తారని చెప్పారు. జనసేనాని గెలిచిన తరువాత ఈ పిఠాపురం రూపు రేఖలే మారిపోతాయని తెలిపారు.

ఇప్పుడు మనమంతా హైదరాబాద్ చూడటానికి ఎలా వెళ్తున్నామో..  పవన్ కళ్యాణ్ గెలిచిన తరువాత  ఇక్కడ జరిగిన అభివృద్ధి చూసి పిఠాపురం చూడటానికి కూడా అలాగే వస్తారని ఆది చెప్పుకొచ్చారు. జనసేన మొదటి విజయం పిఠాపురం నుంచే  మొదలవుతుందని జోస్యం చెప్పారు. అలాగే తాజాగా  జనసేన పోటీ చేస్తున్న అన్ని నియోజక వర్గాలలో పర్యటించి పార్టీ గెలుపునకు తన వంతు కృషి చేస్తానని అన్నారు.

అలాగే తన  షూటింగ్స్ గురించి ఎదురయిన ప్రశ్నలకు జవాబిస్తూ.. నెల రోజుల పాటు ఎలాంటి షూటింగ్స్ కి వెళ్లనని హైపర్ ఆది చెప్పుకొచ్చారు.  ఎన్నికల తరువాతనే షూటింగ్స్ ఉంటాయని చెప్పారు. దీంతో సోషల్ మీడియాలో హైపర్ ఆదిపై పొగడ్తల వర్షం కురుస్తోంది. కొద్ది రోజులుగా హైపర్ ఆది కోసం కొంతమంది వ్యతిరేకంగా పోస్టులు చేస్తున్నారు. ఎన్నికలకు ముందు పవన్ గురించి అంత చెప్పినోడు.. ఎన్నికల సమయంలో ఎక్కడ మాయం అయ్యాడని ప్రశ్నిస్తున్నారు. తాజాగా హైపర్ ఆది వారందరికీ ఘాటుగా సమాధానం చెప్పినట్లు అయింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one + 13 =