కూట‌మిలో క‌ల్లోలం.. నేత‌ల దిద్దుబాటు చ‌ర్య‌లు

Chaos In The Alliance.. Corrective Actions Of The Leaders,AP State elections,Telugu Desam-Jana Sena-BJP Parties,Corrective Actions Of The Leaders,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,TDP,Janasena,Chandrababu Naidu,Pawan Kalyan,Raghu Rama Krishnam Raju,TDP MLA Candidate Ramaraju,Ramaraju

ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేల ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి. తెలుగుదేశం-జ‌న‌సేన‌-బీజేపీ పార్టీలూ సీట్లు స‌ర్దుబాటు, అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న వ‌ర‌కూ ప్ర‌శాంతంగానే జ‌రిగినా, ప్ర‌స్తుతం కొన్నిచోట్ల ఆందోళ‌న‌లు కొన‌సాగుతున్నాయి. తొలుత ఒక‌రిని ప్ర‌క‌టించి, ఆ త‌ర్వాత‌.. పొత్తు స‌ర్దుబాట్ల‌లో భాగం ఆ సీటు వేరొక‌రికి ఇవ్వాల‌ని ఆలోచిస్తున్న నియోజ‌క‌వ‌ర్గాల్లో అయితే.., ఆందోళ‌న‌లు పెల్లుబికుతున్నాయి. ర‌ఘురామ‌కృష్ణం రాజు టీడీపీలో చేర‌డంతో ఆయ‌న‌కు ఉండి సీటును ఇవ్వ‌నున్న‌ట్లు తెలుస్తోంది. దీంతో తొలుత అభ్య‌ర్థిగా జాబితాలో పేరొందిన రామ‌రాజు చంద్ర‌బాబు తీరుపై అసంతృప్తిగా ఉన్నారు. ఆయ‌న అనుచ‌రులు, కార్య‌క‌ర్త‌లు ఆందోళ‌న‌లు చేప‌ట్టారు.

ఇలాంటి ప‌రిస్థితుల్లో కూట‌మి నేతలు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు. ఎన్నిక‌లు స‌మీపిస్తున్న వేళ‌.. మూడు పార్టీల నేత‌లు, కార్య‌క‌ర్త‌ల‌లోనూ ఎక్క‌డా అసంతృప్తులు ఉండ‌కూడ‌ద‌ని నిర్ణ‌యించారు. అసంతృప్తుల జాబితా సిద్దం చేసి వారితో మాట్లాడేందుకు సిద్ధం అవుతున్నారు. దీనిలో భాగంగా ఉండవల్లిలోని టీడీపీ అధినేత చంద్రబాబు నిసవాంలో ఎన్డీయే నేతలు భేటీ అయ్యారు. బీజేపీ రాష్ట్ర ఇన్‌ఛార్జి సిద్ధార్థ నాథ్ సింగ్, పార్టీకి చెందిన ఇతర నేతలు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈ భేటీలో పాల్గొన్నారు. ఈ భేటీలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని సీట్లలో అభ్యర్థుల మార్పుపై చర్చించిన‌ట్లు తెలిసింది. ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో బీజేపీకి బదులుగా టీడీపీ పోటీ చేసే అంశంపై చర్చించారు. దీనికి బదులుగా చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి బీజేపీకి ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్నారు. మరికొన్ని నియోజకవర్గాలపై కూడా చర్చలు జ‌రిపారు.

అలాగే రామ‌రాజుతోను, ఉండి కార్యకర్తలతోను మాట్లాడాల‌ని నిర్ణ‌యించారు. వారితో చంద్రబాబు స‌మావేశం కూడా అయ్యారు. అనంతరం అయన చేసిన కామెంట్స్‌ను బట్టి చూస్తే ఉండి అసెంబ్లీ టికెట్‌ను రఘురామకృష్ణం రాజుకే కేటాయిస్తారని క్లారిటీ వస్తోంది. ఇటీవల రఘురామ సైతం ఉండి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. ఆ ప్రచారానికి ఊతమిచ్చినట్లుగా.. చంద్రబాబు కూడా సైలెంట్‌గా ఉంటూ వచ్చారు. ఇప్పుడు కార్యకర్తల సమావేశంలో క్లారిటీ ఇచ్చేశారు. అయితే, రామరాజుకు కాకుండా.. రఘురామకు టికెట్ కేటాయించడాన్ని ఆయన అనుచరులు వ్యతిరేకిస్తున్నారు. రామరాజుకు టికెట్ ఇవ్వకపోతే ఊరుకునేది లేదంటూ హెచ్చరిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో వీరిని శాంతింపజేసేందుకు చంద్రబాబు నేరుగా కలిశారు. వారికి బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయితే.. రామ‌రాజు మౌనం పాటించిన‌ట్లు తెలిసింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × one =