బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఆంధ్రాకు వర్ష సూచన

IMD Predicts Moderate Rains In Andhra Pradesh within Next 48 Hours, IMD Predicts Moderate Rains In Andhra Pradesh, Moderate Rains In Andhra Pradesh within Next 48 Hours, IMD Predicts Moderate Rains, IMD predicts moderate rainfall In AP, India Meteorological Department, India Meteorological Department Predicts Moderate Rains In Andhra Pradesh, India Meteorological Department Predicts Moderate Rains In Andhra Pradesh within Next 48 Hours, 48 Hours, IMD, IMD Latest News, IMD Latest Updates, moderate rainfall In AP, rainfall, Rains, Andhra Pradesh, AP, Mango News, Mango News Telugu,

వాతావరణ శాఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రానున్న 2 రోజుల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం వచ్చే 48 గంటల్లో బలపడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అయితే, ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోందని, మరో 2 రోజుల్లో తమిళనాడు వైపు పయనించే అవకాశాలు ఉన్నాయని చెప్పారు.

దీని ప్రభావంతో ఈ నెల రేపటినుంచి 7వ తేదీ వరకు రాష్ట్రంలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపారు. ఈ అల్ప పీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ లో నెల్లూరు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు ఒంగోలు, కడప, అనంతపురం జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు. అలాగే, తీరం వెంబడి 45నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉండొచ్చని చెప్పారు. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరించారు. ఇప్పటికే వేటకు వెళ్లిన వారు సాధ్యమైనంత త్వరగా తీరానికి చేరుకోవాలని అధికారులు సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

9 − four =