అక్కడే తొలి బహిరంగ సభ..

YSP Is Ready For Election Campaign, YSP Is Ready For Election, Election Campaign, CM Jagan, YSP First Public Meeting, Public Meeting In Bhimili, Latest YCP News, BHimili Maha Sabha, First YCP Maha Sabha, YCP News Updates, Latest BHimili Maha Sabha, AP, AP Politics, Assembly Election, Mango News, Mango News Telugu
CM Jagan, YSP is ready for election campaign, YSP first public meeting, public meeting in Bhimili ,

ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో అధికార వైసీపీ ఎన్నికల ప్లాన్‌ రెడీ చేసేసుకుంది. వైనాట్ 175అంటూ అన్ని సీట్లను గెలవాలనే టార్గెట్ పెట్టుకున్న సీఎం  జగన్‌.. భీమిలి నుంచి జనవరి 25 నుంచే  ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు. ఏపీని  ఐదు జోన్‌లుగా విభజించి ప్రతీ జోన్‌లో కార్యకర్తలతో ఫేస్ టూ ఫేస్ కార్యక్రమంతో పాటు ఒక బహిరంగ సభ నిర్వహించడానికి ప్లాన్‌ చేశారు.

ప్రచారంపైనే మెయిన్  ఫోకస్ పెట్టిన  వైసీపీ అధిష్ఠానం .. ఉత్తరాంధ్ర నుంచి  ఎన్నికల శంఖారావం పూరించడానికి నిర్ణయం తీసుకుంది.   జగన్‌ అధ్యక్షతన ఉత్తరాంధ్ర ఆరు జిల్లాలకు సంబంధించి భీమిలిలో జనవరి 25న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ సభ నిర్వహహణపై ఉత్తరాంధ్ర జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులకు దిశానిర్దేశం చేశారు.

అలాగే  ఈ సభకు ప్రతి నియోజవర్గం ఐదు నుంచి ఆరు వేల మంది కార్యకర్తలు హాజరయ్యే అవకాశం ఉందని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇక్కడ నుంచే తొలి సభ ఏర్పాటు చేసి ప్రచారం ప్రారంభించడానికి కారణం ఉత్తరాంధ్రపై సీఎం జగన్‌కు ప్రత్యేక శ్రద్ధ ఉండటమేనని అన్నారు. ఏపీని ఐదు జోన్లుగా విభజించిన సీఎం జగన్ ..దానికి అనుగుణంగా కేడర్ సమావేశాలకు ప్లాన్ చేశారు. ఎన్నికల ప్రచారంలో పార్టీ క్రియాశీలక కార్యకర్తలతో జగన్ సమావేశమవుతారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు పార్టీ కేడర్‌ను సన్నద్ధం చేయడమే లక్ష్యంగా ఈ భేటీలు జరగనున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో చేసిన అభివృద్ధిని ప్రజలకు చేర్చే విధంగా సీఎం సన్నద్ధమవుతున్నారు.

వైసీపీలో  అసంతృప్తులను ఎందుకు తొలగించాల్సి వచ్చిందో..ఎమ్మెల్యే అభ్యర్థులకు మార్పులకు గల కారణాలను కూడా నేరుగా ప్రజలకే సీఎం వివరించి చెప్పనున్నారు. మొత్తానికి  అభ్యర్థుల ఎంపికను దాదాపు పూర్తి చేసుకుని  అధికార పార్టీ అతి త్వరలో ఎన్నికల ప్రచారానికి సిద్దమవుతోంటే.. ప్రతిపక్షాలు మాత్రం ఇంకా సీట్ల సర్దుబాటు చర్చల్లోనే ఉన్నాయన్న వార్తలు వినిపిస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =