ప్రకాశం జిల్లాలో రెండు చోట్ల మార్పులు

Pawan fail in politics?, Venuswamy trolling again, Social Media, Prabhas, Rajinikanth, Jagan, Politics,Incharges Seventh List, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections,Mango News Telugu,Mango News
Pawan fail in politics?, Venuswamy trolling again, Social Media, Prabhas, Rajinikanth, Jagan, Politics

వైనాట్ 175 అంటూ ధీమా వ్యక్తం చేస్తున్న అధికార పార్టీ వైసీపీ ఇప్పటికే  ఇన్ఛార్జ్‌లకు సంబంధించి 6  జాబితాలను విడుదల చేసింది. కాస్త గ్యాప్ తీసుకున్ని .. రెండు వారాల తరువాత తాజాగా  7వ జాబితా విడుదల చేసింది వైసీపీ.

కేవలం ప్రకాశం జిల్లాలో పర్చూరు, కందుకూరు నియోజకవర్గాలకు మాత్రమే సీఎం జగన్ కొత్త ఇన్ఛార్జులను  ప్రకటించారు. జగన్ ఆదేశాలతో ఎడం బాలాజీ, కందుకూరుకు కటారి అరవిందా యాదవ్‌ను పార్టీ సమన్వయకర్తలుగా నియమించారు. దీనిపై వైసీపీ కేంద్ర కార్యాలయం ఫిబ్రవరి 16 రాత్రి ఓ ప్రకటనను విడుదల చేసింది. కందుకూరు సిట్టింగ్ ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని మార్చి.. ఈ స్థానంలో మహిళా నేత అరవిందా యాదవ్‌‌ను ఇన్ఛార్జ్గా నియమించారు. పర్చూరు నుంచి పోటీ చేయడానికి సీనియర్ నేత ఆమంచి కృష్ణమోహన్ ఆసక్తి చూపడం లేదని తెలియడంతో.. ఎడం బాలాజీకి పర్చూరు బాధ్యతల్ని అప్పగించారు.

డిసెంబర్ 11న ఇన్ఛార్జ్ల తొలి జాబితాలో  .. 11 అసెంబ్లీ స్థానాలకు కొత్త ఇంఛార్జిలను జగన్ నిర్ణయించారు. రెండో జాబితాలో  మూడు ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలతో మొత్తం  27 స్థానాలు  , మూడో జాబితాలో ఆరు ఎంపీ, 15 అసెంబ్లీ స్థానాలతో  మొత్తం 21 స్థానాలకు , నాలుగో లిస్టులో ఒక ఎంపీ, ఎనిమిది అసెంబ్లీ స్థానాలతో మొత్తం ఎనిమిది స్థానాలకు  ఇంఛార్జీలను ప్రకటించారు.

ఇటీవల విడుదల చేసిన ఐదో జాబితాలో  3 అసెంబ్లీ, 4 ఎంపీ స్థానాలతో మొత్తం ఏడు స్థానాలకు కొత్త ఇంఛార్జిలను నియమించారు. ఆ తర్వాత నాలుగు పార్లమెంట్, ఆరు అసెంబ్లీ స్థానాలకు ఇంఛార్జిలను ప్రకటిస్తూ  ఆరో జాబితా విడుదల చేసింది. తాజాగా ఏడో జాబితా రిలీజ్ చేసిన వైసీపీ 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జ్‌లను ప్రకటించారు

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

4 × 5 =