ఈ ఎన్నికల్లో ఇక్కడ ఏ జెండా ఎగురుతుంది?

Palakonda Constituency Present Politcal Scenario,Srikakulam News,Palakonda, election, congress, tdp,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP Elections, palakonda latest news updates, AP News, Mango News Telugu,Mango News
Palakonda Constituency Present Politcal Scenario,Srikakulam News,Palakonda, election

ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని ముఖ్యమైన నియోజకవర్గం.. పాలకొండ నియోజకవర్గం. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లాలను పునర్విభజించడంతో.. ఈ నియోజకవర్గం పార్వతీపురం మన్యం జిల్లాలో చేరింది. ఇప్పటి వరకు ఇక్కడ 15 సార్లు ఎన్నికలు జరగగా..4 సార్లు టీడీపీ, 4 సార్లు కాంగ్రెస్,2 సార్లు వైసీపీ జెండాలు ఎగిరాయి. గడిచిన రెండు ఎన్నికల్లోను వైసీపీ  ఇక్కడ విజయం సాధించింది.ఇక్కడ మొత్తం 2,24,865 మంది ఓటర్లలో , పురుష ఓటర్లు 1,13,572 మంది, మహిళా ఓటర్లు 1,11,274 మంది  ఉన్నారు.

పాలకొండ నియోజకవర్గంలో 1952లో జరిగినపుడు  కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగిన పి.సంగం నాయుడు కేఎల్పి పార్టీ నుంచి పోటీ చేసిన ఎమ్మార్ నాయుడుపై  విజయం సాధించారు. 1955లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన పిఎస్ అప్పారావు మరో ఇండిపెండెంట్ అభ్యర్థి కేఎస్ నాయుడుని ఓడించారు. 1962లో  స్వతంత్ర పార్టీ అభ్యర్థి కేఎస్ నాయుడు గెలిచారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన పిఎన్ అప్పారావుపై 5453 ఓట్ల తేడాతో విజయం దక్కించుకున్నారు. 1967లో  స్వతంత్ర పార్టీ అభ్యర్థి  జోజి  విజయం సాధించారు. 1972లో  కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి  కే నరసయ్య ..ఇండిపెండెంట్ అభ్యర్థి పి జయమ్మని ఓడించారు.  1978లో జనతా పార్టీ నుంచి  కేజీ రాజారత్నం, కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన డి ఆదినారాయణపై గెలుపు సాధించారు.

1983లో టీడీపీ అభ్యర్థి శ్యామారావు .. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జె.లచ్చయ్యను ఓడించారు.  1985లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి  టీ.భద్రయ్య విజయం సాధించారు. 1989లో కాంగ్రెస్ పార్టీ నుంచి పీజీ అమృతకుమారి ..టీడీపీ అభ్యర్ధిపై గెలిచారు. 1994లో  టీడీపీ అభ్యర్థి టి.భద్రయ్య విజయాన్ని దక్కించుకున్నారు. 1999లో ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి మరోసారి గెలిచారు పీజే అమృతకుమారి. 2004 లో జరిగిన ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కంబాల జోగులు ఇక్కడ విజయం సాధించారు. 2009లో  కాంగ్రెస్ పార్టీ నుంచి నిమ్మక సుగ్రీవులు గెలిచారు.   2014లో వైసీపీ అభ్యర్థి  విశ్వసరాయి కళావతి  విజయం సాధించారు. 2019లో  కూడా  విశ్వసరాయి కళావతి విజయాన్ని సాధించారు. త్వరలో  రానున్న ఎన్నికల్లో కూడా విశ్వసరాయి కళావతి మరోసారి వైసీపీ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు.

ఇక ఇక్కడ  టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి నిమ్మక జయకృష్ణ ప్రయత్నాలు సాగిస్తుండగా.. అంతర్గత విభేదాలతో టీడీపీ నుంచి మరో అభ్యర్థి కూడా తన ప్రయత్నాలను సాగిస్తున్నారు.  గడిచిన మూడు ఎన్నికల్లో కూడా ఇక్కడ ప్రజలు టీడీపీని ఆదరించలేదు.  ఇప్పటివరకు  జరిగిన ఎన్నికలను పరిశీలిస్తే కొంతమంది రెండుసార్లు చొప్పున ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. ప్రస్తుత ఎమ్మెల్యే విశ్వసరాయి కళావతితో పాటు ..పీజే అమృత కుమారి, టి.భద్రయ్య, కే.సంఘం నాయుడు రెండుసార్లు  విజయం సాధించిన వారే.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =