ఎక్కడికక్కడే టీడీపీ నాయకులు అరెస్ట్

Chalo Atmakur rally in Guntur, Chandrababu Naidu and Nara Lokesh Under House Arrest, Chandrababu Naidu Chalo Atmakur Rally, Chandrababu Naidu Under House Arrest, Chandrababu Naidu Under House Arrest Due To The Protest, Mango News Telugu, TDP Leaders Put Under Preventive Custody, TDP Leaders Put Under Preventive Custody Due To The Protest, TDP Leaders Put Under Preventive Custody Due To The Protest Of Chalo Atmakur

టీడీపీ, వైసీపీ పార్టీలు పోటాపోటీగా ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపు ఇవ్వడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఈ నిరసన ర్యాలీ ఆపడానికి గుంటూరు, ఆత్మకూరు ప్రాంతాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చలో ఆత్మకూరు కార్యక్రమానికి వెళ్తున్న పలువురు టీడీపీ నాయకులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 11 వ తేదీ ఉదయం టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కలవడానికి వచ్చిన టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడును చంద్రబాబు నివాసం వద్ద పోలీసులు అరెస్ట్ చేసారు. టీడీపీ ఎంపి కేశినేని నానిని కూడా చంద్రబాబు నాయుడిని కలవడానికి వెళుతుండగా ప్రకాశం బ్యారేజ్ వద్ద అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి అఖిల ప్రియను విజయవాడ నోవాటెల్ హోటల్ లో అరెస్ట్ చేసారు. అనుమతి లేకుండా గదిలోకి పోలీసులు రావడంపై ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసారు.

తంగిరల సౌమ్య, దేవినేని అవినాష్, అయ్యన్న పాత్రుడు, వై.వి.బి రాజేంద్ర ప్రసాద్, వెలగపుడి రామకృష్ణ బాబు, పీలా గోవింద్ మరియు ఇతర టీడీపీ నాయకులును ఎక్కడికక్కడే అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి కొల్లు రవీంద్రను విజయవాడలో గృహ నిర్బంధంలో ఉంచారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావును, గుంటూరులో గద్దె రామ్మోహన రావును, కృష్ణ జిల్లా గొల్లపూడిలో దేవినేని ఉమా మహేశ్వరరావును, ప్రకాశం జిల్లాలో శిద్దా రాఘవరావులను బయటకు రానివ్వకుండా హౌస్ అరెస్ట్ చేసారు. పలు చోట్ల టీడీపీ కార్యకర్తలను సైతం అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు. గుంటూరు జిల్లాలో కొన్ని డివిజన్లలో 144 సెక్షన్ ఉండడం వలన ఎక్కడా జనం గుంపులు గుంపులుగా ఉండకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.

 

Subscribe to our Youtube Channel Mango News for the latest News.

Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here