రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో నేడు ఢిల్లీలో విపక్షాలతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక భేటీ.. సీఎం కేసీఆర్‌ దూరం

CM KCR Likely To Skips Mamata Banerjee's Meet Over Presidential Poll Strategy at Delhi Today, Telangana CM KCR Likely To Skips Mamata Banerjee's Meet Over Presidential Poll Strategy at Delhi Today, KCR Likely To Skips Mamata Banerjee's Meet Over Presidential Poll Strategy at Delhi Today, Mamata Banerjee's Meet Over Presidential Poll Strategy at Delhi Today, Presidential Poll Strategy at Delhi Today, Presidential Poll Strategy, Telangana CM KCR, CM KCR, WB CM Mamata Banerjee, CM Mamata Banerjee, Mamata Banerjee, West Bengal CM Mamata Banerjee, Presidential Poll Strategy News, Presidential Poll Strategy Latest News, Presidential Poll Strategy Latest Updates, Presidential Poll Strategy Live Updates, Mango News, Mango News Telugu,

త్వరలో రాష్ట్రపతి ఎన్నిక జరుగనున్న నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నేడు ఢిల్లీలో విపక్ష పార్టీలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. ఢిల్లీలోని కానిస్టిట్యూషన్‌ క్లబ్‌లో బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనాల్సిందిగా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా దేశవ్యాప్తంగా క్రియాశీలంగా ఉండే 19 పార్టీలు మరియు బీజేపీయేతర పార్టీల సీఎంలకు మమతా బెనర్జీ ఆహ్వానం పలికిన విషయం విదితమే. ఇదే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు కూడా ఆహ్వానం పంపిన విషయం సంగతి తెలిసిందే.

అయితే ఈ కీలక భేటీకి దూరంగా ఉండాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తమ పార్టీ టీఆర్‌ఎస్‌ తరపున ప్రతినిధి బృందాన్ని కూడా పంపకూడదని నిర్ణయించారని సమాచారం. త్వరలోనే జాతీయ రాజకీయాల్లో అరంగేట్రం చేయాలని భావిస్తున్న కేసీఆర్‌ కొత్తగా జాతీయ పార్టీ ఏర్పాటుకు సంబంధించిన సన్నాహాల్లో బిజీగా ఉన్నారు. కాగా తాను ఏర్పాటు చేయనున్న పార్టీని దేశంలోని రెండు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ రెండింటిలో దేనికీ అనుకూలం కాదని, తన దారి వేరని దేశ ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు. ఈ క్రమంలో మమత భేటీలో కాంగ్రెస్ కు కూడా ఆహ్వానం ఉండటంతో ఈ భేటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారని ప్రగతిభవన్‌ వర్గాలు పేర్కొంటున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

12 + 17 =