జనసేనాని పవన్ కళ్యాణ్ ను కలిసిన తిరుపతి ఎంపీ అభ్యర్థి రత్నప్రభ

Tirupati BJP MP Candidate Ratnaprabha Meets Janasena Chief Pawan Kalyan at Hyderabad

తిరుపతి లోక్‌సభ నియోజకవర్గానికి జరగనున్న ఉపఎన్నికలో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థిగా మాజీ ఐఏఎస్‌ అధికారిణి రత్నప్రభ పోటీచేస్తున్న సంగతి తెలిసిందే. ఇరు పార్టీల పొత్తులో భాగంగా ఈ ఉపఎన్నికలో జనసేన పార్టీ బీజేపీ అభ్యర్థిని బలపరుస్తుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో ఎంపీ అభ్యర్థి రత్నప్రభ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ జాతీయప్రధాన కార్యదర్శి పురందేశ్వరి, ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల కోఇన్చార్జి సునీల్ థియోదర్, బీజేపీ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ మధుకర్ కూడా పాల్గొన్నారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో తిరుపతి నియోజకవర్గ పరిధిలో ప్రచారం, అనుసరించాల్సిన వ్యూహాలుపై చర్చించినట్టు తెలుస్తుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

11 + 7 =