జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల దరఖాస్తు గడువు పెంపు

Jagananna Vidya Deevena, Vasathi Deevena New Registrations Date Extended upto Tomorrow

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉండేందుకు ‘’జగనన్న విద్యా దీవెన”, “జగనన్న వసతి దీవెన” పథకాలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకాల కోసం అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకునే గడువును మార్చి 28, ఆదివారం వరకు పొడిగించినట్టు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ వెల్లడించింది. ముందుగా ఈ రెండు పథకాలకు దరఖాస్తు గడువు మార్చి 25 తో ముగిసింది, అయితే విద్యార్థుల నుంచి, కొన్ని కళాశాల నుంచి విజ్ఞప్తులు రావడంతో మార్చి 28 వరకు గడువు పొడిగించినట్టు పేర్కొన్నారు.

వచ్చే ఏప్రిల్‌ 9న జగనన్న విద్యా దీవెన, ఏప్రిల్‌ 27న జగనన్న వసతి దీవెన పథకాలు అమలుపై ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ ‌మోహన్ ‌రెడ్డి సమీక్ష జరిపారు. విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్, వసతి దీవెన కింద హాస్టల్ మరియు భోజన ఖర్చుల విడుదలపై చర్చించి, అధికారులకు సీఎం కీలక సూచనలు చేశారు. ఈ సంవత్సరం నుంచి తల్లుల బ్యాంక్ ఖాతాల్లోనే విద్యా దీవెన డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు.

జగన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్‌, డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ వరకు అన్ని ఉన్నత విద్యలు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, కాపు, మైనారిటీ, దివ్యాంగ విద్యార్థులకు ఫీజు రియంబర్స్‌మెంట్ చెల్లించనున్నారు. ఇక పేద విద్యార్థుల వసతి, భోజన ఖర్చుల నిమిత్తం జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద ప్రతి సంవత్సరం ఐటీఐ విద్యార్థులకు రూ.10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇతర ఉన్నత చదువులు చదివే వారికీ రూ.20 వేలు చెల్లించనున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + 14 =