మరోసారి మంగళగిరి వైసీపీ అభ్యర్థి మార్పు?

Ganji chiranjeevi, Mangalagiri, YCP Candidate, AP Elections,YSRCP,Amaravati Galam,YS Jagan Mohan Reddy,Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, AP Politics, AP updates,andhra pradesh,Mango News Telugu,Mango News
Ganji chiranjeevi, Mangalagiri, YCP Candidate, AP Elections

ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నప్పటికీ.. కొన్ని స్థానాలు మాత్రం ఎప్పుడూ హాట్ టాపికే.. ఆ నియోజకవర్గాల గురించి హాట్ హాట్‌గా చర్చ జరుగుతుంటుంది. అందులో ఒకటి మంగళగిరి. ఈసారి ఈ నియోజకవర్గంపైనే అందరికన్ను ఉంది. అక్కడ ఏం జరగబోతోందని అందరూ ఎదురు చూస్తున్నారు. గతంలో ఆ స్థానంలో ఓడిన నారా లోకేష్ తిరిగి అక్కడి నుంచే పోటీ చేస్తుండడం.. ఈసారి కూడా ఆ స్థానాన్ని దక్కించుకోవాలని అటు వైసీపీ కృతనిశ్చయంతో ఉండడంతో ఈ స్థానపైనే అందరి చూపు ఉంది.

2019 ఎన్నికల్లో నారా లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వైసీపీ అభ్యర్థి ఆళ్లరామకృష్ణారెడ్డి చేతిలో ఓటమిపాలయయ్యారు. ఈక్రమంలో ఓడిన చోటే గెలిచి తీరాలని పట్టుదలతో ఉన్నారు నారా లోకేష్. గెలుపే లక్ష్యంగా తీవ్రంగా కసరత్తు చేస్తున్నారు. అయితే ఈసారి కూడా లోకేష్‌ను ఓడించాలని జగన్ వ్యూహాలు రచిస్తున్నారు. ఈ మేరకు అక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పక్కకు పెట్టేసి.. గంజి చిరంజీవికి ఈసారి అవకాశం ఇచ్చారు. గంజి చిరంజీవి చేనేత సామాజిక వర్గానికి చెందిన నేత.

అటు ఈసారి టికెట్ దక్కకపోవడంతో ఆర్కే వైసీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేశారు. ఇటీవల వైఎస్ షర్మిల కాంగ్రెస్‌లో చేరిన తర్వాత.. ఆయన కూడా కాంగ్రెస్ గూటికి వెళ్లారు. అయితే ఆర్కే కాంగ్రెస్‌లోకి వెళ్లినప్పటికీ.. ఇప్పటికీ కూడా వైసీపీ క్యాడర్ ఆయనతోనే ఉందని ప్రచారం జరుగుతోంది. ఆ ప్రచారం జరుగుతున్నట్లుగానే అక్కడి క్యాడర్ కూడా గంజి చిరంజీవికి ఫెవర్‌గా ఉండడం లేదట. అంతేకాకుండా చిరంజీవికి టికెట్ ఇవ్వడాన్ని కూడా కేడర్ వ్యతిరేకిస్తోందట. వచ్చే ఎన్నికల్లో కూడా కేడర్ చిరంజీవి గెలుపుకోసం పనిచేసే అవకాశం లేదట.

ఈ  పరిణామాలన్నీ తన దృష్టికి రావడంతో జగన్ మంగళగిరిపై ఫోకస్ పెట్టారట. ఇటువంటి పరిణామాలతో ఎన్నికలకు వెళ్తే ఎదురుదెబ్బ తగలడం ఖాయమని జగన్ భావిస్తున్నారట. అందుకే చిరంజీవిని మార్చేసే యోచనలో ఉన్నారట. ఆయన స్థానంలో కొత్త వారి పేర్లను పరిశీలిస్తున్నారట. ఇదే సమయంలో మాజీ ఎమ్మెల్యేలు మరుగుడు హనుమంతరావు, కాండ్రు కమలలు మంగళగిరి వైసీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఈక్రమంలో ఆ సీటును తమకే కేటాయించాలని హైకమాండ్ వద్ద పట్టుపట్టుకొని కూర్చున్నారట వాళ్లిద్దరు. అయితే జగన్ మాత్రం కాండ్రు కమలవైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత, గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం.. పైగా మహిళ కావడంతో సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని జగన్ అనుకుంటున్నారట.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × four =