మరోసారి హస్తినాకు పవన్.. పొత్తుపై క్లారిటీ వచ్చేనా?

TDP-Janasena alliance, BJP, Chandrababu, Pawan kalyan, AP Elections
TDP-Janasena alliance, BJP, Chandrababu, Pawan kalyan, AP Elections

వైసీపీ సర్కార్‌ను ఈసారి గద్దె దించడమే లక్ష్యంగా జనసేన-తెలుగు దేశం కూటమి పావులు కదుపుతోంది. ఎట్టి పరిస్థితిలోనైనా అధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా ముందుకు కదులుతోంది. అయితే తమతో పాటు బీజేపీ కూడా చేతులు కలపాలని టీడీపీ, జనసేన కోరుతున్నాయి. ఇప్పటికే జనసేన -బీజేపీ మిత్రపక్షాలు. ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి. ఈక్రమంలో ఏపీలో కూడా పొత్తుపెట్టుకోవాలని జనసేనాని బీజేపీ హైకమాండ్‌ను కోరుతున్నారు. అటు తెలుగు దేశం పార్టీ కూడా అదే అనుకుంటోంది. బీజేపీ కూడా తమ కూటమిలో చేరితే మరింత కలిసివస్తుందని భావిస్తోంది.

అటు ఎన్నికలు ముంచుకొస్తుండడంతో బీజేపీ నుంచి ఏదో ఒకటి క్లారిటీ తెచ్చుకోవాలని చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్‌లు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ నిర్ణయం కోసం ఇన్ని రోజులు వేచి చూశారు. అటు నుంచి ఎటువంటి సమాచారం లేకపోవడంతో.. సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. సీట్ల సర్దుబాటుపై పవన్, చంద్రబాబు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇదే సమయంలో ఇప్పటికి కూడా ఎన్నికల్లో బీజేపీ తమతో కలిసి వస్తుందనే నమ్మకంతో ఉన్నారట చంద్రబాబు, పవన్ కళ్యాణ్.

అందుకే సీట్ల సర్దుబాటులో భాగంగానే బీజేపీకి కూడా కొన్ని స్థానాలను కేటాయించినట్లు తెలుస్తోంది. పది అసెంబ్లీ స్థానాలు.. ఒక పార్లమెంట్ స్థానాన్ని బీజేపీకి కేటాయించారట. ఇదే సమయంలో అటు బీజేపీ ఏపీలో ఒంటరి పోరుకు  సన్నద్ధమవుతోంది. 175 అసెంబ్లీ స్థానాలు.. 25 పార్లమెంట్ స్థానాల్లో ఒంటరిగా బరిలోకి దిగేందుకు కసరత్తు చేస్తోంది. ఈ మేరకు ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. పెద్ద ఎత్తున నేతలు అప్లై చేసుకున్నారు. దాదాపు మూడు వేలకు పైగా దరఖాస్తులు వచ్చాయి.

అయినప్పటికీ కూడా మరొక్క సారి పొత్తు గురించి బీజేపీ హైకమాండ్‌తో చర్చించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారట. ఈ మేరకు త్వరలోనే పవన్ కళ్యాణ్ హస్తినాకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. బీజేపీ పెద్దలు కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలను కలిసి చివరి సారిగా పొత్తు గురించి చర్చించనున్నారట. ఏదో ఒక నిర్ణయంతోనే తిరిగి పవన్ ఏపీకి రానున్నారట. బీజేపీ నిర్ణయాన్ని బట్టి టీడీపీ, జనసేన పోటీ చేయబోయే స్థానాలు, అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నారట. మరి ఇప్పటికైనా బీజేపీ కూటమి వైపు మొగ్గు చూపుతుందా? లేదా? అనేది చూడాలి.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + nine =