తమిళనాడు నుంచి బరిలోకి ?

Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan, Politics, Lok sabha elections, governor, Tamil nadu, chennai parliment, BJP, Telangana Latest News And Updates,Telangana Politics, Telangana Political News And Updates,Telangana News,Latest political Updates, Mango News Telugu, Mango News
Tamilisai Soundararajan, Governor Tamilisai Soundararajan, Politics, Lok sabha elections

తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎల్‌జీ తమిళిసై సౌందర రాజన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానున్నారా ? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. గవర్నర్‌ అంటే కేవలం రబ్బరు స్టాంపు కాదని, అధికారంలో ఉన్న ప్రభుత్వం, అధికార పార్టీ ఎక్కడ పడితే అక్కడ సంతకం చేయమంటే కుదరదని కుండబద్దలు కొట్టిన‌ట్లు చెప్పిన గ‌వ‌ర్న‌ర్ గా త‌మిళి సై గుర్తింపు పొందారు. గవర్నర్ తెలంగాణ‌లోని నామినేటెడ్‌ ఎమ్మెల్సీ పోస్టుల విషయంలో, విశ్వవిద్యాలయాల వీసీల అంశంలో, ఇతరత్రా పలు వ్యవహారాల్లో అంతరాత్మకు అనుగుణంగా పనిచేశారు. ప్రభుత్వం ప్రొటోకాల్‌ పాటించకున్నా, తనకు కనీస గౌరవమివ్వకున్నా డోంట్‌ కేర్‌ అంటూ ముందుకెళ్లారు. అన్ని అంశాల్లోనూ స‌మ‌గ్రంగా ఉంద‌న్న ఫైల్ కే సైన్ చేశారు.

అలాంటి తమిళిసై సౌందరరాజన్‌ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటారన్నది ఆసక్తికరంగా మారింది. తెలుగునాట ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లో లేనప్పటికీ, ఆమె వచ్చింది రాజకీయ కుటుంబం నుంచే. రాజకీయ పదవులైన ఎమ్మెల్యే, ఎంపీగా సైతం పోటీ చేశారు కానీ గెలవలేకపోయారు. రాజకీయాల్లో ఉంటూనే గవర్నర్‌గా నియమితులయ్యారు. తిరిగి  మళ్లీ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వెళ్లనున్నారు. రాబోయే ఎన్నికల్లో ఆమె తమిళనాడులోని తూత్తుకుడి  లేదా విరుదునగర్‌ నియోజకవర్గాల్లో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారనే ప్రచారం జరుగుతోంది.

గతంలో 2006లో రామనాథపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె అక్కడ ఓటమి పాలయ్యారు. అనంతరం 2009లో ఉత్తర చెన్నయ్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసినా గెలుపుజెండా అందుకోలేకపోయారు. తర్వాత 2011లో వేళచ్చేరి నియోజకవర్గం నుంచి 2019లో తూత్తుకుడి పార్లమెంట్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఓడిపోయారు. తూత్తుకుడిలో ఆమె డీఎంకే అభ్యర్థి కనిమొళి చేతిలో ఓడిపోయారు. తర్వాత తెలంగాణ గవర్నర్‌గా వచ్చారు. పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

ఈ రెండు రాష్ట్రాల్లోనూ ఆమె గవర్నర్‌గా ఉంటూనే రాజకీయాలు చేశారనే ఆరోపణలెదుర్కొన్నారు. అయినా ఆమె వెరవలేదు. తన పనేదో తాను చేసుకుంటూ ముందుకు సాగారు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఆమె ఏదో ఒక చోట నుంచి పోటీ చేయడం ఖాయమని వినిపిస్తోంది. చూద్దాం ఏం జరగనుందో. ఆమెది రాజ‌కీయ నేప‌థ్యం ఉన్న కుటుంబ‌మే. తమిళనాడులో కాంగ్రెస్‌పార్టీ మాజీ అధ్యక్షుడు కమరి ఆనంద్‌ కుమార్తె అయిన తమిళిసై, బీజేపీ విధానాలకు ఆకర్షితురాలై తండ్రి పార్టీని కాదని బీజేపీలో చేరారు. తన నిర్ణయాలెలా ఉంటాయో రాజకీయ రంగ ప్రవేశం ఆరంభంతోనే ఆమె తెలియజేశారు. వైద్యవిద్య నభ్యసించిన ఆమె రాజకీయాల్లోకి రావడంతో బీజేపీ సైతం ఆమెకు తగిన ప్రాధాన్యతనిచ్చింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, అధ్యక్షురాలు, జాతీయ కార్యదర్శి వంటి కీలకమైన పదవులిచ్చింది. ఇప్పుడు అదే పార్టీ నుంచి ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల్లోకి వ‌చ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eleven − 5 =