వైసీపీ అయిదో జాబితా వచ్చేసింది..

YCP, Fifth List Released, YSRCP, CP Leaders, Ys Jagan, Sunil Kumar Chalamalasetty, MLA Anil Kumar Yadav, TDP, Machilipatnam, Andhra pradesh, Andhra Pradesh News Updates, AP Political News, AP Latest news and Updates, Mango News Telugu, Mango News
AP Elections, YCP Fifth list, CM Jagan, YCP Candidates

ఏపీలో ఎన్నికల వేళ అధికార వైసీపీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తోంది. రెండోసారి అధికారం దక్కించుకునేందుకు తీవ్రంగా కసరత్తు చేస్తోంది. ఈ మేరకు అందరికంటే ముందే తమ గెలుపు గుర్రాలను బరిలోకి దింపుతోంది. ఇప్పటి వరకు నాలుగు విడతలుగా జాబితాలను ప్రకటించిన వైసీపీ.. ఇప్పుడు అయిదో జాబితాను కూడా ప్రకటించేసింది. అయితే ఈసారి కేవలం ఏడు స్థానాలకు మాత్రమే ఇంఛార్జ్‌లను ప్రకటించింది. అందులో నాలుగు పార్లమెంట్ స్థానాలు ఉండగా.. మూడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఈ మేరకు మంత్రి బొత్స సత్యనారాయణ అయిదో జాబితాను విడుదల చేశారు.

ముందు నుంచి కూడా ఊహాగాణాలు వెలువడుతూనే ఉన్నాయి. నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్‌ను ఈసారి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దింపుతారని. లావు శ్రీకృష్ణదేవరాయలు స్థానంలో అనిల్ కుమార్‌ను నరసరావుపేట నుంచి బరిలోకి దింపుతారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం నెల్లూరు సిటీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు. అలాగే జగన్ కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఆయనకు ఉంది. ఈక్రమంలో నరసరావు పార్లమెంట్ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా అనిల్ కుమార్ యాదవ్‌ను వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నియమించారు.

అలాగే కాకినాడ ఎంపీ స్థానానికి కూడా చలమలశెట్టి సునీల్ పేరును పరిశీలిస్తున్నారని కొద్దిరోజుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. దానినే నిజం చేస్తూ ఆ స్థానానికి ఇంఛార్జిగా సునీల్ పేరును ప్రకటించారు. అలాగే మచిలీపట్నం పార్లమెంట్ స్థానానికి ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబును ఇంఛార్జ్‌గా నియమించారు. ప్రస్తుతం సింహాద్రి రమేష్ బాబు అవనిగడ్డ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈక్రమంలో ఆయన్ను ఈసారి అసెంబ్లీ ఎన్నికల బరిలోకి కాకుండా.. లోక్ సభ ఎన్నికల బరిలోకి దింపుతున్నారు. ఇక తిరుపతి లోక్ సభ స్థానానికి తిరిగి ఇంఛార్జ్‌గా మద్ధిల గురుమూర్తినే నియమించారు.

ఇక సింహాద్రి రమేష్ బాబును మచిలీపట్నం పంపించడంతో అవనిగడ్డ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. ఈక్రమంలో ఆ స్థానానికి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావుని ఇంఛార్జ్‌గా నియమించారు. సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇంఛార్జ్‌గా నూకతోటి రాజేశ్‌ని నియమించారు. అలాగే అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఈసారి ఇంచార్జ్‌ను మార్చేశారు. మత్స్య లింగానికి అరకు బాధ్యతలు అప్పగించారు. లింగా ఎస్టీలలో బలమైన సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనను అరకు ఇంఛార్జ్‌గా నియమించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్: 

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 + eight =