ఆంధ్రప్రదేశ్ లో మండల పరిషత్‌ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు ఎన్నిక నిర్వహణ

Andhra Pradesh, Andhra Pradesh : Mandal Praja Parishad President and Vice President Election Process Started, Andhra Pradesh Elections for MPP chiefs, Andhra Pradesh Mandal Praja Parishad President Election, Andhra Pradesh Mandal Praja Parishad President Election Process, Andhra Pradesh Vice President Election, Andhra Pradesh Vice President Election Process, Election of MPP ZPP chiefs, Election of MPP ZPP chiefs In Ap, Mandal Praja Parishad President and Vice President Election Process Started, Mango News

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు ఇటీవలే వెలువడిన సంగతి తెలిసిందే. దీంతో పరోక్ష పద్ధతిలో మండల పరిషత్‌ అధ్యక్షులు(ఎంపీపీ), ఉపాధ్యక్షులు మరియు కో-ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నికకు నేడు (సెప్టెంబర్ 24, శుక్రవారం), జిల్లా పరిషత్‌ (జెడ్పీ) చైర్మన్‌, ఇద్దరు వైస్‌ ఛైర్మన్లు, ఇద్దరు కో-ఆప్టెడ్‌ సభ్యుల ఎన్నికను సెప్టెంబర్ 25న నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా మండల పరిషత్‌ అధ్యక్షుల (ఎంపీపీ) ఎన్నికల ప్రక్రియ జరిగింది.

ముందుగా అన్ని చోట్లా కో-ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నికకు నామినేషన్లు స్వీకరణ నిర్వహించారు. అనంతరం నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ కార్యక్రమం జరిగింది. మధ్యాహ్నం 1 గంట నుంచి ఎంపీటీసీల ప్రమాణస్వీకారం, కో-ఆప్టెడ్‌ సభ్యుడి ఎన్నిక చేపట్టారు. అలాగే మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ, ఉపాధ్యక్షులు ఎన్నికకు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. చేతులు ఎత్తే విధానం ద్వారా అన్ని చోట్లా ఎంపీపీ, ఉపాధ్యక్షులను ఎన్నుకున్నారు. ఏదైనా కారణాలతో ఏదైనా మండలంలో శుక్రవారం జరగాల్సిన ఎన్నిక వాయిదా పడితే, ఆయా మండలాల్లో శనివారం ఎన్నిక నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ఎంపీటీసీ సభ్యులుగా గెలిచిన వారి పదవీ కాలం నేటి నుంచి ఐదేళ్ల పాటు కొనసాగనున్నట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో 7,219 ఎంపీటీసీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో అధికార వైఎస్సార్సీపీ 5,998 స్థానాలను కైవసం చేసుకుంది. దీంతో భారీ సంఖ్యలో ఎంపీపీ, ఉపాధ్యక్ష పదవులను కూడా వైఎస్సార్సీపీ దక్కించుకుంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 17 =