పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లాన్ అదేనా?

Will Janasena Contest In Telangana?,Lok Sabha Elections 2024,Pawan Kalyan,Janasena Party,BJP,Janasena News,Janasena,Janasena Latest News,Janasena In Telangana,Telangana,Telangana News,Lok Sabha Elections,Telangana Lok Sabha Elections 2024,Pawan Kalyan Latest News,Pawan Kalyan Live,TDP,Janasena Contest In Telangana Lok Sabha Elections 2024,AP Elections 2024,AP Elections,Pawan Kalyan Janasena,Pawan Kalyan Janasena News,Mango News,Mango News

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయడానికి జనసేన పార్టీ సిద్దమవుతున్నట్లు కనిపిస్తోంది.  జనసేనాని పవన్ కళ్యాణ్ తెలంగాణ లోక్ సభ ఎన్నికలకు సంబంధించి  సమన్వయ కమిటీని ఏర్పాటు చేయడంతో ఈ  ప్రచారం జరుగుతోంది. ఏపీలో టీడీపీ,జనసేన,బీజేపీ కూటమిగా ఎన్నికల బరిలో దిగుతుండటంతో.. పొత్తులో భాగంగా జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేస్తోంది.

ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకుని..  జనసేన టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలంతా ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి వైఎస్సార్సీపీలోకి క్యూ కట్టారు.అయితే  జనసేన అధిష్టానం..తమకు టికెట్లు ఇవ్వలేదనే బాధ కంటే పక్క పార్టీల నుంచి వచ్చిన వారికి పెద్ద పీట వేసి టికెట్ ఇవ్వడంపై ఈ నేతలకు మండిపడుతున్నారు. ఇప్పటికే పోతిన మహేష్, మనుక్రాంత్ రెడ్డి, పితాని బాలకృష్ణ, పాముల రాజేశ్వరి వంటి కొంతమంది  నేతలు పార్టీకి గుడ్‌బై చెప్పారు. మరి కొంతమంది అదే బాట పట్టనున్నారన్న  ప్రచారం జరుగుతోంది.

నేతలంతా వరుసగా పార్టీని వీడుతుండడంతో   జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ అలర్ట్ అయ్యారు.మొన్నటి వరకు అసంతృప్తులపై కన్నెత్తి కూడా చూడని జనసేనాని ఇప్పుడు వారిని సముదాయించే పనిలో పడ్డారు. టికెట్లు దక్కని  నేతలలో కొంతమందికి జిల్లా ఇన్‌ఛార్జ్‌లుగా బాధ్యతలను అప్పగిస్తూ.. మరి కొంతమందికి మాత్రం పార్టీ ఏర్పాటు చేసిన కమిటీలో అవకాశాలు ఇచ్చి మరీ వారిని బుజ్జగించే పనిలో పడ్డారు.

తిరుపతి ఎమ్మెల్యే టికెట్‌‌ను అరణి శ్రీనివాసులుకు కేటాయించడంతో.. జనసేనలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎందుకంటే జనసేన తిరుపతి ఇన్‌ఛార్జ్‌గా ఉన్న కిరణ్ రాయల్ తిరుపతి సీటును ఆశించారు. కానీ వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన అరణి శ్రీనివాసులుకి ఆ టికెట్ కేటాయించడంతో ఆయన అసంతృప్తిగా ఉన్నారు. ఇప్పటికే తిరుపతిలో ప్రచారం కొనసాగిస్తున్న శ్రీనివాసులకి అటు జనసేన నుంచి కానీ, ఇటు టీడీపీ నుంచి సహకారం ఉండటం లేదు. దీంతో తిరుపతి వెళ్లిన పవన్ కళ్యాణ్ కూటమి నేతలతో సమావేశమవడంతో పాటు..ఇటు టీడీపీ అసమ్మతి నేతలతోనూ మాట్లాడారు.

చంద్రబాబుతో కలిసి తిరుపతి జనసేన అభ్యర్థిపై నిర్ణయం తీసుకున్నామని పవన్ కళ్యాణ్ టీడీపీ నేతలకు  వివరించారు. జనసేన అభ్యర్థి గెలుపు కోసం వారంతా కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. ఇదే సమయంలో  తెలంగాణపై పవన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికల+

కోసం  పవన్‌ కళ్యాణ్‌ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. దీనిలో బొంగునూరి మహేందర్‌రెడ్డి సమన్వయకర్తగా, శంకర్‌గౌడ్, రాజలింగం, పొన్నూరి శిరీష, ప్రేమ్‌కుమార్‌, ములుకుంట్ల సాగర్‌ సభ్యులుగా ఉన్నారు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీతో పొత్తులో భాగంగా 7 స్థానాల్లో పోటీ చేసిన జనసేన.. ఆశించినంత మేర సక్సెస్ కాలేకపోయింది. మరి లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసి అయినా తెలంగాణలో ఖాతా ఓపెన్ చేస్తుందా లేదా అన్నది చూడాలి. కానీ ఇప్పటి వరకు 17 లోక్ సభ స్థానాలలో ఒక్క నియోజకవర్గానికి కూడా జనసేన తమ అభ్యర్థులను ప్రకటించలేదు. నామినేషన్ ప్రక్రియకు కేవలం ఐదు రోజులకు ముందు సమావేశం ఏర్పాటు చేయడంతో  ఈ ఎన్నికలలో ప్రత్యక్షంగా పోటీ చేస్తారా లేక ఇతర పార్టీలకు తమ మద్దతు ఇస్తారా అనే చర్చలు నడుస్తున్నాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 6 =