ప్రచారంలోకి హిందూపురం ఎమ్మెల్యే!

Hindupuram MLA Balakrishna To Campaign,Hindupuram Balakrishna Election Campaign Starts,Telugu News,AP State Assembly Elections,Mango News,Mango News Telugu,Andhra Pradesh Elections,Elections 2024,AP Elections 2024,Lok Sabha Polls,AP Polls,AP Politics,AP News,AP Latest News,AP Elections News,AP Elections,AP Assembly Elections 2024,Lok Sabha Elections 2024,MLA Balakrishna,Hindupuram,Hindupuram Politics,Balakrishna,Balakrishna News,Balakrishna Latest News,Balakrishna Speech,Balakrishna Election Campaign,Balakrishna Election Campaign In Hindupuram,Nandamuri Balakrishna,TDP,TDP News,Chandrababu

రానున్న ఎన్నికల్లో ప్రత్యర్థిని చిత్తు చేయడమే టార్గెట్‌గా హిందూపురం ఎమ్మెల్యే, సినీ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో నందమూరి బాలకృష్ణ బస్సు యాత్ర నిర్వహించనున్నారు. బాలయ్య బస్సు యాత్ర కోసం ఇప్పటికే ప్రత్యేక బస్సును సిద్ధం చేశారు. బాలయ్య బస్సుపై అన్ స్టాపబుల్ అంటూ ప్రత్యేక క్యాప్షన్ కూడా ఇచ్చారు. అలాగే టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి లోగోను ముద్రించారు. బస్సు మొత్తం టీడీపీ రంగు పసుపు రంగు వేశారు. అలాగే బస్సుపై నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ ఫొటోలను ముద్రించారు.

టీడీపీ ఫుల్ జోష్‌..:

నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర  కదిరి నుంచి ప్రారంభం కానుంది. మొదటి దశలో ఉమ్మడి అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లాలో బాలయ్య బస్సు యాత్ర నిర్వహించనున్నారు. ఇవాళ(ఏప్రిల్ 13న) కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాల్లో బస్సుయాత్ర జరగనుంది.కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత బస్సుయాత్ర ప్రారంభమవుతుంది. అలాగే రేపు(ఏప్రిల్ 14న) సింగనమల నియోజకవర్గంలోని కల్లూరు, అనంతపురంలోని సప్తగిరి సర్కిల్ మీదుగా యాత్ర సాగనుంది. మరోవైపు ఇప్పటికే టీడీపీ తరుపున చంద్రబాబు, నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌ ప్రచారం చేస్తుండగా.. బాలయ్య కూడా ఎంట్రీ ఇవ్వనుండడం తెలుగు తమ్ముళ్లలో జోష్‌ నింపనుంది.

ఈ సారి కూడా తొడకొడతారా?

హిందూపూరం అసెంబ్లీ నియోజకవర్గం  శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. 2019లో నందమూరి బాలకృష్ణ  ఏపీ శాసనసభ ఎన్నికలలో టీడీపీ నుంచి గెలిచి ప్రస్తుత నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.2019 నాటికి, నియోజకవర్గంలో మొత్తం 208,327 మంది ఓటర్లు ఉన్నారు.ఈ నియోజకవర్గం 1951లో డీలిమిటేషన్ ఆర్డర్స్ (1951) ప్రకారం ఏర్పాటైంది. గత ఎన్నికల్లో బాలకృష్ణకు 90,704 ఓట్లు పడగా.. టీడీపీ అభ్యర్థి షేక్‌ ఇక్బాల్‌కు 72,676 ఓట్లు పడ్డాయి. ఈ సారి కూడా బాలయ్యబాబు గెలుస్తారన్న ధీమాను టీడీపీ వ్యక్తంచేస్తోంది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

13 + 20 =