రెండు నియోజకవర్గాల్లో లోకేష్ పోటీ..? ఇదీ క్లారిటీ..

Lokesh Competition In Two Constituencies This Is Clarity, Lokesh Competition In Two Constituencies, Lokesh Constituencies, Lokesh, Yuvagalam, TDP Party, Constituencies, Elections, Ap State, Lokesh Clarity In Two Constituencies, Latest TDP News, CM Jagan, Chandrababu Naidu, AP CM, Andhra Pradesh, AP Polictical News, Assembly Elections, Mango News, Mango News Telugu
Lokesh, yuvagalam , TDP party , constituencies , elections , ap state

యువగళం పాదయాత్రతో ప్రజల్లోకి దూసుకెళ్లారు నారా లోకేష్. ప్రజల కష్టాలు తెలుసుకుంటూ.. కన్నీళ్లు తుడుస్తూ ముందుకు కదిలారు. విజయవంతంగా పాదయాత్రను పూర్తి చేసి.. పరిణితి చెందిన పరిపూర్ణమైన నాయకుడిగా మారారు. యువగళం.. నవశకం భారీ బహిరంగ సభతో ఎన్నికల శంఖారావం పూరించారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా లోకేష్ ముందుకు కదులుతున్నారు. సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు. ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

అయితే 2014 నుంచి 2019 వరకు మంత్రిగా పని చేసిన లోకేష్.. 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. లోకేష్‌పై వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి 5,337 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో లోకేష్ రెండు చోట్ల నుంచి పోటీ చేయబోతున్నారని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. రిస్క్ చేయడం కంటే రెండు చోట్ల పోటీ చేయడం మేలని లోకేష్ భావిస్తున్నాడని వార్తలొచ్చాయి.

అల్లుడి కోసం బాలకృష్ణ తన నియోజకవర్గాన్ని త్యాగం చేయబోతున్నారని గుసగుసలు వినిపించాయి. ఈసారి హిందూపురం నుంచి బాలకృష్ణ కాకుండా.. లోకేష్ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే గతంలో లోకేష్ మంగళగిరికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేసిన క్రమంలో.. హిందూపురంతో పాటు మంగళగిరి నుంచి కూడా పోటీ చేయబోతున్నారని రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

ఈక్రమంలో రెండు చోట్ల పోటీ చేయబోతున్నారంటూ వస్తోన్న వార్తలపై నారా లోకేష్ స్పందించారు. అవన్నీ బూటకపు వార్తలని మండిపడ్డారు. తాను మంగళగిరి నుంచే పోటీ చేస్తానని క్లారిటీ ఇచ్చారు. తాను గత నాలుగు సంవత్సరాల, తొమ్మిది నెలలుగా మంగళగిరి ప్రజలకు అందుబాటులో ఉంటున్నానని.. వారి తరుపున పోరాడుతున్నానని వెల్లడించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను నియోజకవర్గం మార్చే ప్రసక్తే లేదని లోకేష్ స్పష్టం చేశారు. ఏది ఏమయినప్పటికీ.. తాను ఒక్కచోటనే పోటీ చేస్తానని వివరించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fourteen + 17 =