టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్నీ ఆయనే స్వయంగా ట్విటర్‌లో వెల్లడించారు. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ కరోనా వచ్చిందని తెలిపారు. ఈరోజు తనకు కోవిడ్-19 పాజిటివ్‌గా నిర్దారణ అయ్యిందని చెప్పారు. అయితే, తనకు స్వల్ప లక్షణాలు ఉండటంతో.. వైద్యుల సలహాలతో ప్రస్తుతం హోం ఐసోలేషన్‌లో ఉంటున్నట్లు మహేశ్ బాబు తెలిపారు. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారు టెస్ట్‌లు చేయించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ కరోనా నిబంధనలు పాటించాలని, అందరూ వ్యాక్సిన్ తప్పకుండా తీసుకోవాలని సూచించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ