జీ-సోనీల విలీనం రద్దు

Cancellation Of Zee Sony Merger, Zee Sony Merger, Zee Sony Merger Cancellation, Zee Entertainment, Sony India, Merge, Business News, Latest Zee Sony Merger Mews, Zee Sony Merger Mews Update, Zee Entertainment Latest News, Sony India Latest News, Entertainment channels, OTT, Mango News, Mango News Telugu
zee Entertainment, Sony India, Merge, Business news

సోనీ ఇండియా విభాగం.. జీ ఎంటర్‌‌టైన్‌మెంట్‌లో విలీనానికి సంబంధించి రెండేళ్ల క్రితం ఒప్పందం జరిగిన విషయం తెలిసిందే. జీ, సోనీ కలిసి మెగా ఎంటర్‌టైన్‌మెంట్ కంపెనీగా రూపొందించాలని.. దాదాపు 10 బిలియన్ డాలర్లకు ఈ విలీన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రపంచ దిగ్గజాలు అమెజాన్, నెట్‌ఫ్లిక్స్‌లకు ఈ డీల్ గట్టి పోటీనిస్తుందని అంతా భావించారు. కానీ ప్రస్తుతం కీలక పరిణామం చోటుచేసుకుంది. జీ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రతిపాదిత విలీన ఒప్పందాన్ని సోనీ ఇండియా రద్దు చేసుకుందని బ్లూబ్‌బర్గ్ నివేదించింది. దీంతో రెండేళ్ల ప్రతిష్టంభనకు ఇంతటితో ముగింపు పలికినట్లు అయింది.

సోమవారం సోనీ ఇండియా విభాగం.. జీకి ఒప్పందం రద్దు లేఖను పంపించిందని బ్లూబ్‌బర్గ్ వెల్లడించింది. అయితే డీల్‌లోని షరతులు నెరవేరకపోవడటమే సోనీ ఇండియా ఈ డీల్‌ను రద్దు చేసుకోవడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం జీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గావున్న పునీత్ గోయెంకాపై తమ సొంత ప్రయోజనాల కోసం సంస్థ నిధులు మళ్లించారని ఆరోపణలు ఉన్నాయి.  ప్రస్తుతం ఆయన సెబీ విచారణ ఎదుర్కొంటున్నారు. గతేడాది అప్పటి ఎస్సైల్ గ్రూప్ చైర్‌పర్సన్ సుభాష్ చంద్ర, పునీత్ గోయెంకా సెంబీలో లిస్ట్ అయిన కంపెనీలో డైరెక్టర్‌, కీలకమైన మేనేజర్ పదవిని నిర్వహించకుండా సెబీ నిరోధించింది.

ఈక్రమంలో విలీన సంస్థకు పునీత్ నాయకత్వం వహిస్తారా..? లేదా..? అన్నదానిపై ప్రతిష్టంభన ఏర్పడింది. ఈక్రమంలో ఆయనపై విచారణ జరుగుతున్న క్రమంలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక సోనీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈక్రమంలో డిసెంబర్ చివరలో నిర్ణయించిన గడువుపై ఇరుపక్షాలు ఓ ఒప్పందానికి రాకపోవడంతో.. 30 రోజుల గ్రేస్ పీరియడ్ ముగిసిన తర్వాత ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ సోనీ.. జీకి టర్మినేషన్ లెటర్ పంపించిందని బ్లూమ్‌బర్గ్ పేర్కొంది.

(శీర్షిక తప్ప, ఈ కథనం మ్యాంగో న్యూస్ సిబ్బందిచే సవరించబడలేదు మరియు సిండికేట్ ఫీడ్ నుండి ప్రచురించబడింది.)

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + three =