పలు దేశాల్లో పెరుగుతున్న కరోనా కేసులు, జీనోమ్ సీక్వెన్సింగ్‌ పై రాష్ట్రాలకు కేంద్రం అలర్ట్

Centre Alerts States to increase Genome Sequencing Amid Rise in COVID-19 cases in China USA,Genome COVID-19,COVID-19 Genome Sequence,COVID-19 USA,COVID-19 China,Mango News,Mango News Telugu,Coronavirus In India,Covid In India,Covid,Covid-19 India,Covid-19 Latest News And Updates,Covid-19 Updates,Covid India,India Covid,Covid News And Live Updates,Carona News,Carona Updates,Carona Updates,Cowaxin,Covid Vaccine,Covid Vaccine Updates And News,Covid Live

చైనా, జపాన్, యూఎస్ఏ, బ్రెజిల్ సహా పలు దేశాల్లో కరోనా పాజిటివ్ కేసులు అకస్మాత్తుగా పెరుగుతున్న దృష్ట్యా కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. ఇన్సాకాగ్ నెట్‌వర్క్ ద్వారా కరోనా వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి కరోనా పాజిటివ్ కేసుల శాంపిల్స్ ను హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్‌ కోసం పంపించాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆరోగ్యశాఖ సెక్రటరీ రాజేష్ భూషణ్ మంగళవారం ఒక లేఖ రాశారు.

టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్ మరియు కోవిడ్ సముచిత ప్రవర్తన అనే ఐదు అంచల వ్యూహంపై దృష్టి సారించిన భారతదేశం కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రించగలిగిందని మరియు దేశంలో ప్రస్తుతం వారానికి దాదాపు పన్నెండు వందల కేసులు నమోదవుతున్నాయన్నారు. అయితే కరోనా యొక్క ప్రజారోగ్య సవాలు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోందని, ప్రపంచంవ్యాప్తంగా వారానికి ముప్పై ఐదు లక్షల కేసులు నమోదవుతున్నాయని చెప్పారు. “జూన్, 2022లో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కరోనాపై నిఘా వ్యూహం కార్యాచరణ మార్గదర్శకాలను సవరిస్తూ, వ్యాప్తిని ముందస్తుగా గుర్తించడం, ఐసోలేషన్ లో ఉంచడం, పరీక్షించడం మరియు అనుమానితులకు సకాలంలో చికిత్స అందించడం, కొత్త కరోనా వేరియంట్‌ల వ్యాప్తిని గుర్తించి, ధృవీకరించబడిన కేసులను పర్యవేక్షించాలని రాష్ట్రాలకు సూచించింది. అందువలన ఇప్పటికే ఉన్న వేరియంట్‌ల ట్రెండ్‌లను పర్యవేక్షించడం చాలా ముఖ్యం” అని పేర్కొన్నారు.

“జపాన్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, బ్రెజిల్ మరియు చైనాలలో అకస్మాత్తుగా పెరుగుతున్న కేసుల దృష్ట్యా, ఇండియన్ సార్స్-కోవ్-2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) నెట్‌వర్క్ ద్వారా వేరియంట్‌లను ట్రాక్ చేయడానికి పాజిటివ్ కేసుల శాంపిల్స్ ను హోల్ జీనోమ్ సీక్వెన్సింగ్‌ను సిద్ధం చేయడం చాలా అవసరం. ఇటువంటి ఎక్సరసైజ్ దేశంలో చలామణిలో ఉన్న కొత్త వేరియంట్స్ ను సకాలంలో గుర్తించడానికి వీలు కల్పిస్తుంది మరియు దాని కోసం అవసరమైన ప్రజారోగ్య చర్యలను సులభతరం చేస్తుంది. ఈ నేపధ్యంలో రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు మ్యాప్ చేయబడిన నిర్ణీత ఇన్సాకాగ్ జీనోమ్ సీక్వెన్సింగ్ లాబొరేటరీస్ (ఐజీఎస్ఎల్ఎస్)కి రోజువారీగా, అన్ని పాజిటివ్ కేసుల యొక్క సాధ్యమైనంత వరకు నమూనాలను పంపాలని అన్ని రాష్ట్రాలకు సూచిస్తున్నాం. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు చేసిన స్థిరమైన కృషిని మెచ్చుకుంటుంది మరియు ఈ విషయంలో అన్ని రాష్ట్రాలకు అవసరమైన సహాయాన్ని అందించడం కొనసాగిస్తుంది” అని లేఖలో పేర్కొన్నారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − ten =