నేడు విదేశాంగ మంత్రి జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్‌ దోవల్‌తో చైనా విదేశాంగ మంత్రి ‘వాంగ్ యీ’ కీలక భేటీ

Chinese Foreign minister Wang Yi To Be Held Talks with Jaishankar and NSA Doval Today, minister Wang Yi To Be Held Talks with Jaishankar and NSA Doval Today, Chinese Foreign minister Wang Yi To Be Held Talks with Jaishankar, Chinese Foreign minister Wang Yi To Be Held Talks with NSA Doval Today, Chinese Foreign minister Wang Yi, Chinese Foreign minister, Wang Yi, Foreign minister Wang Yi, Foreign Minister of the People's Republic of China, Wang Yi Foreign Minister of the People's Republic of China, Wang Yi Foreign Minister of China, China, Mango News, Mango News Telugu,

చైనా విదేశాంగ మంత్రి ‘వాంగ్ యీ’ భారత్‌ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటనలో భాగంగా శుక్రవారం దేశ రాజధానిలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మరియు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌లను కలవనున్నారు. జూన్ 2020లో గాల్వాన్‌లో జరిగిన ఘర్షణ మరియు తూర్పు లడఖ్‌లో సరిహద్దు ప్రతిష్టంభన తర్వాత ఒక ఉన్నత స్థాయి చైనా అధికారి మొదటిసారి సందర్శించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. తూర్పు లడఖ్, భారతదేశం మరియు చైనాలోని వాస్తవ నియంత్రణ రేఖ (LAC) వెంబడి ఉన్న ప్రాంతాల వద్ద గడచినా సంవత్సర కాలంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కల్నర్‌ సంతోష్‌ బాబుతో సహా 20 మంది భారత జవాన్లు అమరులయిన విషయం తెలిసిందే.

కాబూల్ నుంచి న్యూఢిల్లీకి వచ్చిన చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ ఈరోజు జాతీయ భద్రతా సలహాదారు (ఎన్‌ఎస్‌ఏ) అజిత్ దోవల్‌తో సమావేశమవుతున్నారు. గాల్వాన్ వ్యాలీ స్టాండ్‌ఆఫ్ తర్వాత చైనా-భారత్ మధ్య ద్వైపాక్షిక సమస్యలపై ఇద్దరూ చర్చించే అవకాశం ఉంది. దీనికి ముందు ముందు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌ను కూడా కలవనున్నారు. మరోవైపు వివాదాస్పద కాశ్మీర్ ప్రాంతంపై ఈ వారం పాకిస్తాన్‌లో చేసిన వ్యాఖ్యలకు వాంగ్ తన పర్యటనకు ముందు భారత ప్రభుత్వం నుండి నిరసన ఎదుర్కొన్నారు. వాంగ్ యి తన మూడు రోజుల పాకిస్తాన్ పర్యటన తర్వాత ఆఫ్ఘనిస్తాన్‌లోని కాబూల్‌లో పర్యటించారు. జైశంకర్‌తో భేటీ తర్వాత వాంగ్ నేపాల్ వెళ్లనున్నారు. సరిహద్దు ఉద్రిక్తతతో పాటు ఉక్రెయిన్‌పై రష్యా దాడి విషయంపై కూడా ఇరువురు నేతలు చర్చిస్తారని సమాచారం. కాగా భారత్, చైనా రెండు దేశాలు రష్యాను స్నేహపూర్వక దేశంగా పరిగణిస్తాయి.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 + seven =