ఫసిఫిక్‌ సముద్రంలోని టోంగాలో అగ్నిపర్వతం పేలుడు – సునామీ హెచ్చరిక

Causing Tsunami Waves as Far as The West Coast, Mango News, Massive Volcano Erupts Near Tonga, Tonga volcano eruption triggers tsunami warnings, Tsunami advisories lifted in US, Tsunami advisories lifted in US after waves hit Tonga, Tsunami Damage Are Seen in Tonga, Tsunami warning on the West Coast and Hawaii, Tsunami Waves as Far as The West Coast, Tsunami waves hit Tonga after volcano eruption, US West Coast and Hawaii are under a tsunami, US West Coast and Hawaii are under a tsunami advisory

దక్షిణ ఫసిఫిక్‌ సముద్రంలోని ద్వీపకల్పమైన టోంగాలో సముద్ర గర్భంలోని అగ్నిపర్వతం శనివారం బద్దలయింది. దీంతో ఒక్కసారిగా ప్రపంచ దేశాలు ఉలిక్కిపడ్డాయి. సముద్రం లోపల ఉన్న హుంగా టోంగా హాపై అనే అగ్నిపర్వతం వరసగా రెండు రోజులు పేలడంతో టోంగా వ్యాప్తంగా బూడిద మేఘాలు కమ్ముకున్నాయి. ఈ బూడిద 19 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించినట్లు ఫసిఫిక్ ప్రాంతంలోని టోంగా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. దీనికారణంగా, అమెరికా నుంచి జపాన్‌ వరకు తీరప్రాంతంలోని పలు దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. కాగా, ఈ పేలుడుతో ఆ ప్రాంతంలో ఎంత మేరకు నష్టం వాటిల్లిందనేది తెలియరాలేదు. అయితే, లక్షకు పైగా జనసాంద్రత ఉన్న టోంగా తీరప్రాంతాలపై భారీ అలలు విరుచుకుపడ్డాయి.

భారీ అలలు జనావాసాలను ముంచెత్తుతున్న వీడియోలను అక్కడి ప్రజలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. దీనివలన జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తున్నారు. ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. అయితే, అగ్నిపర్వత పేలుడు తదనంతర పరిస్థితులలో సంభవించిన బూడిద, లావా వలన అక్కడి సముద్ర ఉపరితల వాతావరణం విపరీతంగా వేడెక్కింది. దీంతో, సముద్ర జీవులపై ఇది తీవ్ర ప్రభావం చూపినట్లు అధికారులు తెలిపారు. కొన్ని గంటల తర్వాత, ముప్పు తొలగిపోవడంతో అమెరికాలో సునామీ హెచ్చరికల్ని వెనక్కి తీసుకున్నారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three × 4 =