ప్రజ్ఞాన్ రోవర్‌ తన పని తను చేసేసింది

ISRO says there is no problem even if Pragyan rover does not wake up,ISRO says there is no problem,even if Pragyan rover does not wake up,ISRO Pragyan rover,Mango News,Mango News Telugu,Chandrayaan-3,Pragyan Rover, ISRO, Somanath, ISRO says there is no problem, Pragyan rover does not wake up,ISRO Latest News,ISRO Latest Updates,ISRO Live News,Pragyan rover News Today,Pragyan rover Latest Updates

చంద్రుడిపై దాగున్న రహస్యాలను కనుక్కోవడానికి ఈ ఏడాది జులై 14న భారత అంతరిక్ష సంస్ధ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ కథ ముగిసిపోయినట్లేనన్న వార్తలు ఈ మధ్య జోరుగా వినిపిస్తున్నాయి . భూమిపై నుంచి బయలు దేరిన తర్వాత 40 రోజుల పాటు ప్రయాణం చేసి ఆగస్టు 23న చంద్రుడిపై సురక్షితంగా ల్యాండ్ అయింది చంద్రయాన్ 3 . తర్వాత అక్కడి నుండి ఫొటోలు, వీడియోలు కూడా పంపింది . అక్కడ 150 మీటర్ల పాటు ప్రయాణించిన రోవర్, ల్యాండర్ కూడా ఒకదానికొకటి ఫోటోలు తీసుకుని పంపాయి. వాటితో పాటు అక్కడి మూలకాల ఆనవాళ్లను కూడా పంపాయి. ఆ తర్వాత స్లీప్ మోడ్‌కు జారుకున్నాయి. కానీ ఆ రెండు ఇప్పుడు ఏకంగా శాశ్వత నిద్రలోకే వెళ్లిపోయాయన్న వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఛైర్మన్‌ సోమనాథ్‌ తాజాగా స్పందించారు.

చంద్రయాన్‌-3 ప్రాజెక్టులో భాగంగా చంద్రుడిపై అడుగుపెట్టిన ప్రజ్ఞాన్ రోవర్‌.. తనకు అప్పగించిన పనిని ఇప్పటికే పూర్తి చేసేసిందని, స్లీప్‌ మోడ్‌ నుంచి బయటకు రాకపోయినా ఇబ్బందేం లేదని సోమనాథ్‌ చెబుతున్నారు. ఖగోళాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి వీలుగా ఎక్స్‌రే పోలారిమీటర్‌ శాటిలైట్‌ అంటే ఎక్స్‌పోశాట్‌పై ప్రస్తుతం తాము దృష్టి సారించినట్లు చెప్పారు. నవంబర్‌ లేదా డిసెంబర్‌ నెలలో తాము ఈ ప్రయోగం చేపడతామని కానీ స్పష్టమైన తేదీని ఇంకా చెప్పలేమని చెప్పారు.

గుజరాత్‌లోని గిర్‌ సోమనాథ్‌ జిల్లాలో గల ప్రముఖ సోమనాథ్‌ ఆలయాన్ని దర్శించుకున్నఇస్రో ఛైర్మన్‌ సోమనాథ్‌ మీడియాతో మాట్లాడుతూ… ప్రజ్ఞాన్‌ రోవర్‌ ఇంకా స్లీప్‌ మోడ్‌లోనే ఉందని చెప్పారు. చంద్రుడిపై రాత్రి పూట అంటే భూమిపై 14 రోజులకు సమానమని.. పగలు కంటే దాదాపు 200 డిగ్రీల వరకూ ఉష్ణోగ్రతలు పడిపోతాయని చెప్పారు. ఒకవేళ ప్రజ్ఞాన్‌ రోవర్‌లోని ఎలక్ట్రానిక్‌ సర్క్యూట్‌లు ..ఈ ఉష్ణోగ్రత మార్పును తట్టుకొని నిలబడగలిగితే మాత్రం.. రోవర్‌ కచ్చితంగా మేల్కొంటుందని చెప్పారు. ప్రజ్ఞాన్‌ తిరిగి క్రియాశీలకం కాకపోయినా కూడా ఏం ఫర్వాలేదని అన్నారు.

చంద్రుడిపై రాత్రి సమయం పూర్తయిన తర్వాత విక్రమ్‌ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్లను మేల్కొలడానికి తాము ప్రయత్నించినట్లు ఇటీవల ఇస్రో వెల్లడించింది. మరోవైపు ఎక్స్‌పోశాట్‌తోపాటు, ఇన్‌శాట్‌-3డీఎస్‌ను కూడా తాము నవంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ప్రయోగించనున్నట్లు సోమనాథ్‌ చెప్పారు. వాతావరణంలో చోటు చేసుకుంటున్న మార్పులపై అధ్యయనానికి ఈ ప్రాజెక్టులు దోహదం చేస్తాయని చెప్పారు.అంతేకాదు.. నాసా, ఇస్రో సంయుక్తంగా మరో ప్రాజెక్టు చేపడుతోందని చెప్పిన సోమనాథ్…. దీనిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రయోగిస్తామని తెలిపారు.

 

మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nine − 7 =