కరోనాతో ఒకేరోజు 300 మంది మృతి, మరో 10,483 పాజిటివ్ కేసులు నమోదు

Corona Positive Cases in Maharashtra, Corona Positive Cases In Maharashtra, Maharashtra, Maharashtra , Maharashtra Corona, Maharashtra Corona Cases, Maharashtra Corona Deaths, Maharashtra Corona Positive Cases, Maharashtra Coronavirus, Maharashtra Coronavirus Positive Cases, Maharashtra Coronavirus Updates, Maharashtra COVID 19

దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర రాష్ట్రంలో కరోనా అధిక ప్రభావం చూపుతున్న సంగతి తెలిసిందే. గత కొన్నిరోజులుగా ఒకేరోజు వ్యవధిలో రోజుకి 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 200 కు పైగా మరణాలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రంలో ఆగస్టు 7, శుక్రవారం నాడు ఒక్కరోజే కొత్తగా 10483 కరోనా పాజిటివ్ కేసులు, 300 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,90,262 కి చేరగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 17,092 కి పెరిగింది. ఇక కొత్తగా కోవిడ్ నుంచి 10906 మంది కోలుకోవడంతో ఇప్పటివరకు 3,27,281 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1,45,582 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు మహారాష్ట్రలో ఆగస్టు 7 నాటికీ 26,54,681 కరోనా పరీక్షలు నిర్వహించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 4 =