కేరళలో విమాన ప్రమాద ఘటన: మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు పరిహారం

Air India crash in Kerala, Air India Express aircraft skids, Air India Express crash LIVE, Air India Express plane skids off runway, Air India flight crash live updates, Air India plane crash, Air India Plane Crash at Kerala, Air India Plane Skids Off Runway In Kerala, Kerala, Kerala Plane Crash, Kozhikode Air India Express plane crash

కేరళలోని కోజికోడ్‌లో ఆగస్టు 7, శుక్రవారం రాత్రి ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో ఇప్పటివరకు 18 మంది మరణించగా, 100 మంది పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో కొలికోడ్ లో‌ విమాన ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్ ‌సింగ్ పూరి పరిశీలించారు. అక్కడి పరిస్థితిని, సహాయక చర్యలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల పరిహారాన్ని అందజేస్తామని మంత్రి ప్రకటించారు. అలాగే తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల పరిహారం అందజేస్తామని చెప్పారు.

మరోవైపు ఈ ఘటనలో గాయపడి కోలికోడ్ మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్న వారిని కేరళ సీఎం పినరయి విజయన్, ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ పరామర్శించారు. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమని వారు పేర్కొన్నారు. అలాగే ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, ప్రభుత్వ అధికారులు స్పందించిన తీరును సీఎం విజయన్ మెచ్చుకున్నారు. ఓ వైపు వర్షం, కరోనా పరిస్థితులు ఉన్నా కూడా సహాయం చేసేందుకు ముందుకు వచ్చారని అన్నారు. ప్రమాద బాధితులకు రక్తదానం చేసేందుకు కూడా పెద్ద సంఖ్యలో ప్రజలు క్యూ కట్టడం అభినందనీయమని సీఎం పినరయి విజయన్ పేర్కొన్నారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

17 + 20 =