దూసుకొస్తున్న యాస్ తుఫాన్, తెలుగు రాష్ట్రాలపై ప్రభావం!

Cyclone Yaas Likely to Intensifies into Severe Cyclonic Storm in Next 24 Hours, Cyclone Yaas, Cyclone Yaas After Tauktae, Cyclone Yaas LIVE updates, Cyclone Yaas may hit east coast, Cyclone Yaas News, Cyclone Yaas To Hit East Coast, Cyclone Yaas Tracking, Cyclone Yaas Updates, Mango News, Severe Cyclone Yaas To Hit East Coast In Next 24 Hours From Bay Of Bengal, Tauktae, Very severe cyclone Yaas to hit north Odisha coast, Very severe Cyclone Yaas to hit West Bengal Odisha, Weather Forecast Today

యాస్ తుఫాన్ దూసుకొస్తోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. వచ్చే 12 గంటలలో యాస్ తుఫాన్ తీవ్రమైన తుఫానుగా, తర్వాత 24 గంటలలో చాలా తీవ్రమైన తుఫానుగా మారనుందని చెప్పారు. ఇక మే 26, బుధవారం తెల్లవారుజాము సమయంలో ఉత్తర-వాయువ్య దిశగా వెళ్లి ఉత్తర ఒడిశా-పశ్చిమ బెంగాల్ సమీపంలో తీరాన్ని తాకవచ్చని తెలిపారు. ఈ తుపాను ప్రభావంతో ఈ మూడు రోజుల్లో ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్, తెలంగాణ, అస్సాం, జార్ఖండ్ వంటి రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు.

యాస్ తుఫాన్ నేపథ్యంలో సహాయక చర్యల నిమిత్తం ఇప్పటికే 99 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామని ఎన్డీఆర్ఎఫ్ డిజి సత్యప్రధాన్ తెలిపారు. ఒడిశాలో 52 బృందాలను మోహరించగా, బెంగాల్లో 35 బృందాలు, మిగతా బృందాలు ఆంధ్రప్రదేశ్, అండమాన్ నికోబార్, తెలంగాణలో అందుబాటులో ఉన్నట్టు చెప్పారు. మే 24 నుండి 26 మే వరకు మత్స్యకారులు మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లోద్దని అధికారులు ఆదేశాలు ఇచ్చారు. మరోవైపు ఈ తుఫాన్ తీవ్రతపై ఒడిశా, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులతో, అండమాన్ అండ్ నికోబార్ లెఫ్టినెంట్ గవర్నర్ తో కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా సోమవారం నాడు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని కోవిడ్-19 హాస్పిటల్స్, లాబ్స్, వ్యాక్సిన్ కోల్డ్ చైన్స్ మరియు ఇతర వైద్యపరమైన అవసరాలకు పవర్ బ్యాకప్ ఏర్పాట్లు చేసుకోవాలని అమిత్ షా సూచించారు. అలాగే బెంగాల్, ఒడిశా మరియు ఆంధ్ర ప్రదేశ్‌లో రాష్ట్రాల్లో ఉన్న ఆక్సిజన్ జెనరేషన్ ప్లాంట్లపై యాస్ తుఫాన్ ప్రభావాలను అమిత్ షా సమీక్షించారు. ఇక తుఫాన్ ప్రభావమున్న రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా చర్యలు తీసుకునేలా అధికారులకు ఆదేశాలు ఇచ్చి, ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

5 × five =