అల్లోపతి వైద్యంపై వ్యాఖ్యలు ఉపసంహరించుకున్నట్టు ప్రకటించిన యోగాగురు రామ్ దేవ్ బాబా

Baba Ramdev, Baba Ramdev Comments Against Allopathic Medicines, Baba Ramdev Comments On Allopathic Medicines, Baba Ramdev issues apology, Baba Ramdev Tenders Apology For His Comments, Baba Ramdev Tenders Apology For His Comments Against Allopathic Medicines, Baba Ramdev withdraws his remarks against allopathy, Baba Ramdev withdraws objectionable statement on allopathic medicines, Baba Ramdev withdraws statement on allopathic medicines, IMA docs in Siliguri hit out at Ramdev claims, IMA seeks action against Ramdev, Mango News

యోగాగురు రామ్ దేవ్ బాబా అల్లోపతి వైద్యంపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. “గౌరవ మంత్రి హర్షవర్ధన్ జీ, నేను మీ లేఖను అందుకున్నాను. వివిధ వైద్య విధానాలపై వివాదాన్ని ముగించేందుకు నేను నా వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నాను” అని రామ్ దేవ్ బాబా ట్వీట్ చేశారు. ముందుగా అల్లోపతి వైద్యం ఒక “స్టుపిడ్ సైన్స్” అని, ఈ మందులు కరోనా రోగుల చికిత్సలో విఫలమయ్యాయని అంటూ రామ్‌ దేవ్ బాబా చేసిన వ్యాఖ్యలతో కూడిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వ్యాఖ్యలపై ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) తీవ్రస్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ, రామ్ దేవ్ బాబాపై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్ష్ వర్ధన్‌ కు ఫిర్యాదు చేసింది.

ఐఎంఏ ఫిర్యాదుతో ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ హర్షవర్ధన్‌ రామ్ దేవ్‌ బాబాకు ఆదివారం నాడు లేఖ రాశారు. కరోనా బాధితులకు నయం చేయడంలో అల్లోపతి ఔషదాలు గొప్పగా పనిచేశాయని, తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. కరోనా బాధితులను, పౌరులను కాపాడటానికి ఫ్రంట్‌లైన్ కార్మికులు, హెల్త్ వర్కర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టారని పేర్కొన్నారు. హెల్త్ వర్కర్స్ మనోధైర్యాన్ని దెబ్బతీసేలా ఉన్న వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొండని సూచించారు. ఈ క్రమంలో ఆరోగ్య మంత్రి హర్ష్ వర్ధన్ రాసిన లేఖపై రామ్‌ దేవ్ బాబా స్పందిస్తూ అల్లోపతి వైద్యంపై తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించారు.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =