ఇండియా vs సౌతాఫ్రికా మూడో టెస్ట్: 5 వికెట్లతో చెలరేగిన బుమ్రా

3rd Test, 3rd Test Live News, India vs South Africa, India vs South Africa 3rd Test, India vs South Africa Cricket, India vs South Africa Cricket Score, India vs South Africa Highlights, India vs South Africa Latest News, India vs South Africa Latest Updates, Indian Pace Bowler Jasprit Bumrah, Indian Pace Bowler Jasprit Bumrah’s 5-Wicket Haul, Jasprit Bumrah’s 5-Wicket Haul, Jasprit Bumrah’s 7th 5-wicket haul hands India, Jasprit Bumrah’s Five-Wicket Haul Gives India, Mango News, SA Vs IND, SA Vs IND 3rd Test

ఇండియా vs సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న సిరీస్‌ నిర్ణాయక మూడో టెస్ట్‌ రసవత్తరంగా సాగుతోంది. బుమ్రా 5 వికెట్లతో చెలరేగటంతో సౌతాఫ్రికా 210 పరుగులకు ఆల్ అవుట్ అయింది. బౌలర్లకు అద్భుతంగా సహకరిస్తున్న పిచ్ ను టీమిండియా బౌలర్లు సద్వినియోగం చేసుకోవటంతో సఫారీలను తక్కువ స్కోరుకే కట్టడి చేయగలిగారు. తద్వారా ఇండియాకు 13 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది.  దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ పీటర్సన్‌ (72) అర్ధ శతకంతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. షమి, ఉమేష్‌ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్‌.. బుధవారం ఆటముగిసే సమయానికి 2 వికెట్లకు 57 పరుగులు చేసింది.

ఓపెనర్లు రాహుల్‌ (10), మయాంక్‌ (7) మళ్లీ విఫలమయ్యారు. మయాంక్‌ను రబాడ అవుట్‌ చేయగా.. రాహుల్‌ను జెన్సెన్‌ పెవిలియన్ కి పంపాడు. పుజార, కోహ్లీ మూడో వికెట్‌కు అజేయంగా 33 పరుగులు జోడించి ఆదుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పుజార 9 పరుగులతో, కోహ్లీ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. మొత్తంగా టీమిండియా 70 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ గెలవాలంటే టీమిండియా రెండో ఇన్నింగ్స్ లో సాధ్యమైనన్ని పరుగులు సాధించాలి. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫామ్ లోకి రావటం భారత్ కి శుభసూచకం. 79 పరుగులతో బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడిన కోహ్లీ రెండో ఇన్నింగ్స్‌లో కూడా చెలరేగాలని ఆశిద్దాం.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 1 =