దేశంలో గత 24 గంటల్లో కోలుకున్న 26,988 మంది కరోనా బాధితులు, రికవరీ రేటు 98.49 శాతం

India Reports 13166 Covid-19 Cases 302 Deaths In Last 24 Hours, 13166 New Covid-19 Positive Cases and 302 Deaths Reported In India, 13166 New Covid-19 Cases 302 Deaths in Last 24 Hours In India, Covid-19 Updates of India 13166 Positive Cases 302 Deaths Reported on FEB 24rd, India Covid-19 Updates 13166 Positive Cases 302 Deaths Reported on FEB 24rd, 13166 new Covid-19 cases, 13166 new Covid-19 cases In India, 302 Deaths In India, India Covid-19 Updates, India Covid-19 Live Updates, India Covid-19 Latest Updates, Coronavirus, coronavirus India, Coronavirus Updates, COVID-19, COVID-19 Live Updates, Covid-19 New Updates, Mango News, Mango News Telugu, Omicron Cases, Omicron, Update on Omicron, Omicron covid variant, Omicron variant, 13166 Positive Cases, India Department of Health, India coronavirus, India coronavirus News, India coronavirus Live Updates,

దేశంలో కరోనా మహమ్మారి ప్రభావం తగ్గుముఖం పట్టింది. రోజువారీ కరోనా కేసులు 15 వేలకు దిగువకు చేరుకున్నాయి. గత 24 గంటల్లో కొత్తగా 13,166 పాజిటివ్ కేసులు, 302 మరణాలు నమోదయ్యాయి. దీంతో ఫిబ్రవరి 25, శుక్రవారం ఉదయం 8 గంటల నాటికీ కరోనా కేసుల సంఖ్య 4,28,94,345 కు, మరణాల సంఖ్య 5,13,226 కి పెరిగిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇక రోజువారీ పాజీటివిటీ రేటు 1.28 శాతంగా నమోదవగా, వీక్లి పాజీటివిటీ రేటు 1.48 శాతంగా ఉంది.

అలాగే దేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా గణనీయంగా పెరుగుతుంది. గత 24 గంటల వ్యవధిలో 26,988 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి మొత్తం సంఖ్య 4,22,46,884 కు చేరుకుంది. కరోనా రికవరీ రేటు 98.49 శాతం గానూ, మరణాల రేటు 1.20 శాతంగా ఉంది. దేశవ్యాప్తంగా ఆసుపత్రుల్లో, హోమ్ ఐసొలేషన్ లలో ప్రస్తుతం 1,34,235 (0.31%) మంది చికిత్స పొందుతున్నారు. కాగా ప్రపంచంలో ఎక్కువ కరోనా కేసులు నమోదైన దేశాల్లో భారత్ రెండో స్థానంలో, కరోనా మరణాలు ఎక్కువుగా నమోదైన దేశాల్లో మూడో స్థానంలో నిలిచింది.

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 5 =