భారత్‌ రెండో ఇన్నింగ్స్ లో ‌36 పరుగులే, తొలిటెస్టులో ఆస్ట్రేలియా ఘన విజయం

India vs Australia 1st Test : Australia Won By 8 Wickets,India vs Australia 1st Test Day 3 Highlights,India vs Australia 1st Test Highlights 2020,India vs Australia Highlights 1st Test Match,India vs Australia Day 3 Highlights,India vs Australia Highlights Day 3 Test Match,India vs Australia 1st Test 2020,India vs Australia 1st Test Score,India vs Australia 1st Test 2020 Live Score,Highlights India vs Australia Match,Ind vs Aus 1st Test Highlights,Aus vs Ind Vs 1st Test Highlights,India vs Australia Live,Virat Kohli,Mango News,Mango News Telugu,Ind vs Aus 1st Test,Australia Won By 8 Wickets,India vs Australia 1st Test Day 3 Highlights,India vs Australia 1st Test Australia Won,Australia Thrash India By 8 Wickets,India vs Australia 1st Test Results,India vs Australia 1st Test Score

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా అడిలైడ్ ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరిగిన తొలి డే/నైట్ టెస్ట్ లో ఆస్ట్రేలియా జట్టు‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. దీంతో నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆస్ట్రేలియా 1-0 తో ఆధిక్యంలో నిలిచింది. 09/1 వద్ద మూడోరోజు రెండో ఇన్నింగ్స్‌ ప్రారంభించిన భారత్ జట్టు 21.2 ఓవర్ల లోనే 36 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ ముగించింది. ఆస్ట్రేలియా బౌలర్లు‌ హాజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌ దాటికి భారత బ్యాట్స్‌మెన్ వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. ఆరుగురు సింగిల్‌ డిజిట్‌కే స్కోర్ తోనే పెవిలియన్ బాట పట్టగా, మరో ముగ్గురు డకౌట్ అయ్యారు. ఉమేష్ యాదవ్ 4 పరుగులతో నాటౌట్ నిలిచినప్పటికీ మహ్మద్‌ షమీ రిటైర్డ్‌ అవుట్‌గా వెనుదిరగడతో భారత్‌ రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్ వుడ్ 5, కమ్మిన్స్ 4 వికెట్లు తీశారు.

అయితే భారత జట్టుకు తోలి ఇన్నింగ్స్ లో లభించిన 53 పరుగుల ఆధిక్యం, రెండో ఇన్నింగ్స్‌ లో 36 పరుగులతో కలిసి ఆస్ట్రేలియా‌ విజయ లక్ష్యం 90 పరుగులుగా మారింది. 90 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు 2 వికెట్లు కోల్పోయి 21 ఓవర్లలోనే ఘనవిజయాన్ని అందుకుంది. ఓపెనర్లు జో బర్స్న్‌ (51), వేడ్‌ (33), లబుషేన్‌ (6), స్మిత్ (1) పరుగులు పరుగులు సాధించారు. ఇక రెండో టెస్టు డిసెంబర్ 26 న మెల్ బౌర్న్ స్టేడియంలో జరగనుంది.

భారత్–ఆస్ట్రేలియా తోలి టెస్టు వివరాలు:

భారత్ తోలి ఇన్నింగ్స్: 244-10

విరాట్ కోహ్లీ (74), పుజారా (43), అజింక్య రహానే (46)
మిచెల్ స్టార్క్ 4/53, కమ్మిన్స్ 3/48

ఆస్ట్రేలియా తోలి ఇన్నింగ్స్: 191-10

పైన్ (89), లబుషేన్‌ (47)
అశ్విన్ 4/55, ఉమేష్ యాదవ్ 3/40, బుమ్రా 2/52

భారత్ రెండవ ఇన్నింగ్స్: 36-9

మయాంక్ అగర్వాల్ (9), హనుమ విహారి (8)
హాజల్ వుడ్ 5/8, కమ్మిన్స్ 4/21

ఆస్ట్రేలియా రెండవ ఇన్నింగ్స్: 93-2

జో బర్స్న్‌ (51), వేడ్‌ (33)
అశ్విన్ 1/16

మ్యాంగో న్యూస్ లింక్స్:

టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 + 12 =