ఐపీఎల్-2020 ఫైనల్, ప్లేఆఫ్స్‌ షెడ్యూల్‌ ఇదే…

BCCI Announces schedule and venue details, IPL 2020, IPL 2020 Final & Playoff Schedule, IPL 2020 Playoffs, IPL 2020 Playoffs And Final Schedule Announced, IPL 2020 playoffs schedule, IPL-2020 Playoffs Dates, IPL-2020 Playoffs Dates and Venues, IPL-2020 Playoffs Dates and Venues Announced, Venue for IPL 2020 Playoffs

యూఏఈలో జరుగుతున్న ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)-2020 క్రీడాభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ, ఉత్కంఠభరితంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఐపీఎల్-2020 టైటిల్ దక్కించుకునేందుకు 8 జట్లలో ఇప్పటికే ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజెర్స్ బెంగళూరు దాదాపుగా ప్లేఆఫ్స్ బెర్తు ఖాయం చేసుకోగా, ఇంకో స్థానం కోసం మిగతా జట్లు పోటీ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌-2020‌ ప్లేఆఫ్స్‌ షెడ్యూల్ ‌ను ఆదివారం నాడు ప్రకటించారు. ముందు కేవలం లీగ్‌ దశ మ్యాచ్‌ ల షెడ్యూల్ మాత్రమే వెల్లడించగా, ప్లేఆఫ్స్‌ మ్యాచ్ లు ఆడే తేదీలను, వేదికలను తాజాగా బీసీసీఐ ఖరారు చేసింది. నవంబర్‌ 3వ తేదీతో లీగ్‌ దశ మ్యాచ్‌ లు పూర్తవనుండగా, నవంబర్ 5 ప్లేఆఫ్స్‌ మ్యాచులు మొదలుకానున్నాయి.

ఐపీఎల్-2020 ప్లేఆఫ్స్‌ షెడ్యూల్:

  1. నవంబర్ 5, 2020 – 7:30 PM – క్వాలిఫయర్‌-1 (టీమ్ 1 vs టీమ్ 2) – దుబాయ్
  2. నవంబర్ 6, 2020 – 7:30 PM – ఎలిమినేటర్ (టీమ్ 3 vs టీమ్ 4) – అబుదాబి
  3. నవంబర్ 8, 2020 – 7:30 PM – క్వాలిఫయర్‌-2 (ఎలిమినేటర్ లో గెలిచిన టీమ్ vs క్వాలిఫయర్ లో ఓడిన టీమ్) – అబుదాబి
  4. నవంబర్ 10, 2020 – 7:30 PM – ఫైనల్ మ్యాచ్ – (క్వాలిఫయర్‌-1 లో గెలిచిన టీమ్ vs క్వాలిఫయర్‌-2 లో గెలిచిన టీమ్) – దుబాయ్

 

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 + nineteen =