ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానం: సీఎం జగన్

AP Badugu Vikasam Program, AP CM YS Jagan, AP CM YS Jagan Launches Jagananna YSR Badugu Vikasam Program, AP News, AP Political Updates, Badugu Vikasam Program, Badugu Vikasam Program In AP, Jagananna YSR Badugu Vikasam Program, YSR Badugu Vikasam Program

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాష్ట్రంలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తల కోసం 2020–23 ప్రత్యేక పారిశ్రామిక విధానంతో “జగనన్న వైఎస్ఆర్ బడుగు వికాసం” కారక్రమాన్ని సీఎం వైఎస్ జగన్ ఈ రోజు క్యాంప్ కార్యాలయంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ఎస్సీ, ఎస్టీలు శ్రామికులుగా మిగిలిపోకూడదని, పెద్ద పెద్ద పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనే లక్ష్యంతోనే ఈ విధానాన్ని తీసుకొచ్చామని అన్నారు.

ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, రాష్ట్రంలో రూ. 1 కోటి ఇన్సెంటివ్‌లు ఇస్తున్నామని అన్నారు. అలాగే రాష్ట్రంలోని ఇండస్ట్రియల్‌ పార్కుల్లో ఎస్సీలకు 16.2%, ఎస్టీలకు 6% భూములు కేటాయిస్తున్నామని తెలిపారు. స్టాంప్ డ్యూటీ రాయితీ, వడ్డీ రాయితీ, ఎస్జిఎస్టీ రాయితీ, క్వాలిటీ సర్టిఫికేషన్‌, పేటెంట్‌ రుసుముల్లో రాయితీ వంటి ఎన్నో ప్రోత్సాహకాలు ఎస్సీ, ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు లభించనున్నాయని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు.

మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:

గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN

ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen − 8 =